Kuppam: కుప్పంలో తమిళ యాక్టర్‌ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

Peddireddy Ramachandra Reddy Gives Clarity on Kuppam Candidate - Sakshi

సాక్షి, చిత్తూరు జిల్లా: ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి సిఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించాం. ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించట్లేదు.

విద్య, వైద్యంకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలరు అని సీఎం గుర్తించారు. ప్రతి పార్లమెంట్‌లో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

చదవండి: (దళారీలకు టీటీడీ చెక్‌.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం)

కుప్పంలో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ
'2024 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్‌ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్‌ జగన్‌కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top