Vijay Antony: 'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Vijay Antony injured on sets of Pichaikkaran 2 in Kuala Lumpur - Sakshi

సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్‌ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్‌(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్‌–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో  విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత.

అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి.  మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో  ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్‌లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  విజయ్ వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది.  ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్‌లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం,  మజై పిడిక్కత మనితన్‌ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top