24 ఏళ్ల తర్వాత కలిసిన హీరోహీరోయిన్ | Sakhi Movie Madhavan And Shalini Met After 24 Years | Sakshi
Sakshi News home page

Madhavan Shalini: అప్పట్లో హిట్ కపుల్.. ఇప్పుడు అంతే క్యూట్‌గా

Oct 28 2024 1:35 PM | Updated on Oct 28 2024 2:05 PM

Sakhi Movie Madhavan And Shalini Met After 24 Years

రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' క్రేజ్ వేరే లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన మాధవన్, షాలినీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది దాదాపు 24 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

సందర్భంగా ఏంటో తెలీదు గానీ మాధవన్‌ని చాన్నాళ్ల తర్వాత కలిసి షాలినీ.. రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి 'ఎండ్రెండుం పున్నాగై' అని క్యాప్షన్ పెట్టింది. 'ఎప్పటికీ నవ్వడం' అని తెలుగులో దీనికి అర్థం. తమ అభిమాన జోడీని దాదాపు 24 ఏళ్ల తర్వాత చూసిన ఫ్యాన్స్.. సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. కామెంట్స్ పెడుతూ తమ ప్రేమని చూపిస్తున్నారు.

ఇక మాధవన్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉండగా.. షాలినీ తమిళ హీరో అజిత్ ని 2000లో పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.

(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)

Advertisement
 
Advertisement
Advertisement