సినిమా ఇంటర్వ్యూ.. ప్రముఖ హీరోకి ఫైన్ వేసిన పోలీసులు | Tamil Actor Prashanth Fined By Chennai Traffic Police | Sakshi
Sakshi News home page

Prasanth: ఇంటర్వ్యూ ఇచ్చాడు.. జరిమానా పడింది!

Aug 2 2024 8:39 AM | Updated on Aug 2 2024 8:46 AM

Tamil Actor Prashanth Fined By Chennai Traffic Police

ప్రముఖ హీరోకి జరిమానా పడింది. కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఊహించని విధంగా పోలీసులకు ఇతడు చిక్కాడు. దీంతో ఫైన్ వేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసుకోవాలి కదా బ్రో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: Kalki 2898 AD: గుడ్‌ న్యూస్‌.. చవక రేటుకే కల్కి టికెట్స్‌)

'జీన్స్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో ప్రశాంత్.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు. తెలుగులో 'వినయ విధేయ రామ' చిత్రంలో సహాయ పాత్ర చేశాడు. ప్రస్తుతం విజయ్ 'ద గోట్' మూవీలోనూ కీ రోల్ చేశాడు. ఇది కాకుండా 'అంధగన్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇది ఆగస్టు 9న థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే బైక్‌పై చెన్నై రోడ్లపై తిరుగుతూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చెన్నై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రూ.2000 చలాన్ వేసినట్లు ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్. తెలుగులోనూ నితిన్ హీరోగా దీన్ని చాన్నాళ్ల క్రితమే రీమేక్ చేశారు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్‌నే బెస్ట్: కీర్తి సురేశ్‌)

Advertisement
 
Advertisement
Advertisement