చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్‌ ఇంట తీవ్ర విషాదం! | Tamil Actor Shine Tom Chacko Father Sibi Chacko Dies In Car Accident Near Palacode | Sakshi
Sakshi News home page

తమిళ నటుడు చాకో కారుకు ప్రమాదం... తండ్రి మృతి!

Jun 6 2025 9:52 AM | Updated on Jun 6 2025 10:40 AM

Tamil Actor Shine Tom Chacko Father Dies In Car Accident

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా  పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో  చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

షైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్‌లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement