Shine Tom Chacko
-
దసరా విలన్‌పై మరో నటి ఆరోపణలు.. సెట్లో చాలా అసభ్యంగా!
దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్‌లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది. సెట్లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్)కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. -
దసరా విలన్‌కు ఊరట.. ఆ విషయంలో క్షమాపణలు చెప్పిన నటి
దసరా విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలతో ఆయనపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు తీసుకునేందు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోలీసులు రైడ్ చేయడంతో ఓ హోటల్ నుంచి పారిపోయాడని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.అయితే అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోన్న విన్సీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. టామ్ చాకోపై తానేలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని తెలిపింది. ఈ సమస్యను చిత్ర పరిశ్రమలో కాకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేరళ ఫిల్మ్ ఛాంబర్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి దాఖలు చేసిన ఫిర్యాదును మాత్రం ఉపసంహరించుకోబోనని ఆమె తెలిపారు. ఇప్పటికైనా మలయాళ చిత్ర పరిశ్రమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని విన్సీ తెలిపారు. అందుకే తాను ఫిర్యాదుతో ముందుకు వెళ్లానని విన్సీ అలోషియస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు.కాగా.. ఓ మూవీ షూట్ సమయంలో షైన్ టామ్ చాకో తన దుస్తులను సరిచేయమని పట్టుబట్టాడని ఆరోపిస్తూ విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. వీరిద్దరు కలిసి నటించిన 'సూత్రవాక్యం' సెట్స్‌లో టామ్ డ్రగ్స్ వాడాడని కూడా ఆమె ఆరోపించింది. తన ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారణకు సహకరిస్తానని నటి తెలిపింది. కాగా.. విన్సీ అంతకుముందు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. షైన్ టామ్ చాకో పేరును కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజీ నంతియట్టు మీడియాకు వెల్లడించారని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అతని పేరును బయటికి చెప్పినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని విన్సీ తెలిపింది. -
దసరా నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణలో పాల్గొన్నాడు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన షైన్ టామ్ చాకో అక్కడినుంచి పరారైనట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మూడో అంతస్తు నుంచి దూకి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ఆ విజువల్స్ ఆధారంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా పోలీసు విచారణకు తన న్యాయవాదితో హాజరయ్యారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్‌స్టేషన్‌కు ఆయన వచ్చారు. విచారణ అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటారని గతంలోనే పలుమార్లు వార్తలు వచ్చాయి. రీసెంట్గా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియన్ కూడా ఆయనపై పదునైన విమర్శలు చేసింది. సినిమా సెట్లోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో తన పట్ల చాలా అభ్యంతరకరంగా ఆయన వ్యవహరించారని ఆమె చెప్పింది. దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలీసుల భయంతో.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకేసి నటుడు
-
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్‌కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల బృందం హోటల్‌కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం. -
దసరా విలన్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన
దసరా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా ఆయనకు ఓ కేసులో ఊరట లభించింది. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతనితో పాటు మరో ఆరుగురిని కొచ్చిలోని అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు కొకైన్ సేవించినట్లు సరైనా ఆధారాలు లేవంటూ నటుడు చాకో సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరితో పాటు ఓ నైజీరియన్, తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. జనవరి 30, 2015న కొచ్చిలోని కడవంత్రాలోని ఒక ఫ్లాట్‌లో కొకైన్ సేవించారని షైన్ టామ్ చాకోతో పాటు నలుగురు మహిళా మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2015 మార్చిలో బెయిల్ పొందిన తర్వాత అందరూ జైలు నుంచి బయటకు వచ్చారు.కాగా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాలో చిన్ననంబిగా విలనిజంతో మెప్పించారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా పాత్రలు దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య డాకు మహారాజ్లో కూడా నటించారు. ప్రస్తుతం మలయాళంలో సినిమాలతో బిజీగా ఉన్నారు.రు. -
'దేవర' విలన్‌కి అరుదైన వ్యాధి.. అదేంటంటే?
సెలబ్రిటీలు చాలామంది అందంగా కనిపిస్తుంటారు. కాకపోతే కొందరికి అరుదైన వ్యాధులు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా వాళ్లే సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతుంటారు. కొన్నాళ్ల ముందు తనకు ఏడీహెచ్‌డీ అనే రుగ్మత ఉందని మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ బయటపెట్టాడు. ఇలాంటి వ్యాధి తనకు కూడా ఉందని మరో మలయాళ నటుడు షైన్ టాక్ చాకో చెప్పుకొచ్చాడు. కాకపోతే తానేం బాధపడట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))మలయాళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. తెలుగులో నాని 'దసరా', నాగశౌర్య 'రంగబలి' సినిమాల్లో విలన్‌గా చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర'లో ప్రతినాయకుడిగా నటించాడు. ఇదలా పక్కనబెడితే ఈ ఏడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడేమో ఆమెతే బ్రేకప్ అయిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలన్నింటినీ డిలీట్ చేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షైన్.. తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇది ఉన్న వ్యక్తులు.. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని, ఇతర నటీనటుల నుంచి ప్రత్యేకంగా ఉండటానికి ట్రై చేస్తారని చెప్పాడు. బయట వ్యక్తులు దీన్ని ఓ రుగ్మతగా భావిస్తారని తాను మాత్రం దీన్ని ఓ క్వాలిటీలానే చూస్తానని అభిప్రాయం వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?) -
మొన్ననే నిశ్చితార్థం.. ఇంతలోనే బ్రేకప్ చెప్పేసిన 'దసరా' విలన్
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో త్వరలో రెండో పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన ప్రియురాలితో నిశ్చితార్ధం కూడా చేసుకున్న 40 ఏళ్ల షైన్ టామ్ ఇప్పుడు బ్రేకప్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన మాటలు షాక్‌కు గురిచేశాయి. తెలుగులో నాని నటించిన దసరా సినిమాలో విలన్‌గా మెప్పించిన షైన్ టామ్ చాకో ఆ తర్వాత రంగభళిలో కనిపించిన విషయం తెలిసిందే.నటుడు షైన్ టామ్ సాకో మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో ఒకరు. మలయాళ సినిమా నమ్మల్లో చిన్న పాత్రలో నటించి నటుడిగా మారారు. ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5 సుందరిగళ్, వినోద్ అక్క సూంట, దా తాడియా వంటి చిత్రాలలో విలన్‌గా మెప్పించాడు. యాక్టర్, కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్లో దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో తీవ్రవాదిగా నటించి కోలీవుడ్‌కు దగ్గరయ్యాడు. అలా డబుల్ ఎక్స్‌లో జిగర్తాండలో మెరిశాడు. అలా సౌత్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.40 ఏళ్ల షైన్ టామ్ చాకో తన చిరకాల స్నేహితురాలు, మోడల్ తనూజాతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో, సైన్ టామ్ సాకో సోషల్ మీడియా నుంచి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తొలగించాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. షైన్ టామ్ చాకో ఇటీవల ఇచ్చిన ఓ ఇంర్వ్యూలో తాను 'మళ్లీ సింగిల్' అని వెల్లడించాడు. తనూజాతో సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని పంచుకున్నాడు. తమ బంధం కలుషితంగా మారిందని వివరించాడు. ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయానని షైన్ టామ్ అంగీకరించాడు. ప్రస్థుతం తాను డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టానని, నచ్చిన యువతి కోసం వెతుకుతున్నానని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలోనూ, వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పాడు. అయితే, అతనికి తబితా మాథ్యూస్ అనే భార్య, కూతురు ఉంది. వారిద్దరూ గతంలోనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Shine Tom Chacko Engagement: లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన దసరా విలన్.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?
ప్రముఖ విలన్.. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిపోయాడు. చాలారోజుల నుంచి ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయమై కొన్నాళ్లుగా జంటగా ఫొటోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తమ బంధం గురించి వస్తున్న పుకార్లకు తెరదించాడు. తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011 నుంచి నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షైన్.. హీరో కమ్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్డౌన్ టైంలో మన ఆడియెన్స్ మలయాళ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. అలా ఇతడు కూడా మనకు సుపరిచితుడు అయిపోయాడు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) గతేడాది నాని 'దసరా' మూవీలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి'లోనూ నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లోనూ నటిస్తున్నాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి తనూజ అనే అమ్మాయితో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల షైన్ టామ్ చాకో.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరో 1-2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే షైన్ టామ్ చాకోకి ఇప్పటికే పెళ్లి అయినట్లు వికిపీడియాలో ఉంది. తబీతా అనే మహిళతో పెళ్లయిందని, వీళ్లకు ఓ బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ) View this post on Instagram A post shared by Shine Tom Chacko (@shinetomchacko_official) -
Rangabali Review: 'రంగబలి' సినిమా రివ్యూ
టైటిల్: రంగబలి నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు నిర్మాణ సంస్థ: SLV సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: పవన్ బాసంశెట్టి సంగీతం: పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేదీ: 07-07-2023 హీరో నాగశౌర్య పేరు చెప్పగానే మంచి క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. అలానే చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'ఛలో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కట్లేదు. ఇప్పుడు 'రంగబలి' అనే కమర్షియల్ ఎంటర్టైనర్తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ నాగశౌర్య చెప్పినట్లు ఉందా? సినిమా టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? శౌర్య(నాగశౌర్య)ది రాజవరం. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ ఎక్కువగా షో చేస్తుంటాడు అందుకే అందరూ ఇతడిని 'షో' అని పిలుస్తుంటారు. ఊరంటే పిచ్చి ఇష్టం. చచ్చినా బతికినా సొంతూరిలోనే అనేది శౌర్య మనస్తత్వం. అలాంటిది ఓ పనిమీద వైజాగ్ వెళ్తాడు. అక్కడ సహజ(యుక్తి తరేజా)ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. దీంతో పెళ్లి గురించి మాట్లాడేందుకు శౌర్య.. సహజ తండ్రి కలవడానికి వెళ్తాడు. తనది రాజవరం అని చెబుతాడు. తన ఊరిలోని 'రంగబలి' సెంటర్ ప్రస్తావన వస్తుంది. దీంతో ఆయన పెళ్లికి నో చెబుతాడు. ఇంతకీ ఆ సెంటర్‌తో శౌర్య పెళ్లికి వచ్చిన చిక్కేంటి? చివరకు శౌర్య ఏం చేశాడు? అనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అనగానే.. ఎలా ఉంటుందా అనేది మనకు ఓ ఐడియా ఉంది. దానికి ఏ మాత్రం అటు ఇటు కాకుండా 'రంగబలి' తీశారు. ట్రైలర్ లో చెప్పినట్లు.. బయట ఊరిలో బానిసలా బతకడం కంటే సొంతూరిలో సింహంలా బతకాలనేది హీరో క్యారెక్టరైజేషన్. ఫస్టాప్ మొదలవడమే మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోయారు. మంచి ఎలివేషన్‌తో హీరో ఎంట్రీ. ఆ వెంటనే ఫైట్. ఆ తర్వాత హీరో చుట్టూ ఉండే వాతావరణాన్ని సీన్ బై సీన్ చూపించారు. తండ్రి విశ్వం(గోపరాజు రమణ)కి ఊరిలో మెడికల్ షాప్. కొడుకు శౌర్యకి దాన్ని అప్పగించాలని ఆయన ఆశ. మనోడేమో ఊరిలో కుర్రాళ్లతో బేవార్స్ గా తిరుగుతుంటాడు. ఓ పనిమీద శౌర్య వైజాగ్ వెళ్లడం, అక్కడ హీరోయిన్ తో హీరో లవ్ లో పడటం, పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇలా సీన్లన్నీ వెళ్తుంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాల్ని ఎక్కడో చూశామే అనిపించినప్పటికీ ఫస్టాప్ మొత్తం హీరో అతడి ఫ్రెండ్ అగాధం క్యారెక్టర్ చేసే కామెడీతో అలా వెళ్లిపోతుంది. పెళ్లి కోసం హీరోయిన్ తండ్రి దగ్గరకు వెళ్లిన హీరోకు తన ఊరిలో 'రంగబలి' సెంటర్ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంతకీ ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఉన్న సమస్యేంటి? చివరకు అది పరిష్కారమైందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు ఓ పాయింట్ చెప్పాలనుకున్నాడు. దాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా తీశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్టాప్ మొత్తాన్ని స్టోరీ సెట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. సెకండాఫ్ లో అసలు విషయాన్ని బయటపెట్టాడు. కానీ అది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన కథలా అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏం కొత్తగా ఉండదు. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. అప్పటివరకు మారని జనం.. హీరో 5 నిమిషాల స్పీచ్ ఇవ్వగానే మారిపోతారు. కొన్నేళ్ల ముందు వరకు ఈ తరహా స్టోరీలంటే ఓకే గానీ.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయిన ఈ జమానాలో కూడా ఇలాంటి స్టోరీలా బాసూ! ఎవరెలా చేశారు? హీరో నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తనదైన ఈజ్‌తో యాక్టింగ్, కామెడీ, డ్యాన్సులు అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. యాక్షన్ హీరో కావాలనే ఆరాటం ఈ సినిమాలో బాగానే కనిపించింది. అవసరం లేకున్నా సరే కొన్నిచోట్ల బాడీని చూపించాడు. ఫైట్లు కూడా చేశాడు. స్టోరీకి తగ్గట్లు అవి కాస్త లాజిక్‌గా ఉండుంటే బాగుండేది. హీరోయిన్ యుక్తి తరేజాకు పెద్దగా స్కోప్ దక్కలేదు. హీరోతో లవ్ సీన్లు, రెండు మూడు పాటల్లో కనిపించింది. ఓ పాటలో అయితే కిస్, స్కిన్ షోతో రెచ్చిపోయింది! మిగిలిన వాళ్లలో సత్య గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్టాప్ ని తన కామెడీతో లాక్కొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫస్టాప్ కి సత్యనే హీరో. లేకపోయింటే సినిమా బలైపోయేది! గోపరాజు రమణ హీరో తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు. సత్య, గోపరాజు రమణ పాత్రలకు ఫస్టాప్ లో దొరికిన స్పేస్.. సెకండాఫ్ లోనూ ఉండుంటే బాగుండేది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. ఇందులో విలన్‌గా చేశాడు. అతడి పాత్ర పరిచయం ఓకే కానీ ఎండింగ్ పేలవంగా ఉంది. నటుడిగా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అసలు అతడి పాత్రకు సరైన సీన్లు ఒక్కటంటే ఒక్కటీ పడలేదు. సెకండాఫ్ లో శరత్ కుమార్, శుభలేఖ సుధాకర్ పర్వాలేదనిపించారు. మిగిలినవాళ్లు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే.. పవన్ సీహెచ్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. అవి కూడా సందర్భం లేకుండా వస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ అండ్ డైరెక్టర్ పవన్ బాసంశెట్టికి ఇది తొలి సినిమా. కొన్ని సీన్లనీ బాగానే హ్యాండిల్ చేశాడు గానీ సినిమా కథ, సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'రంగబలి'.. కాస్త ఫన్ కాస్త ఎమోషన్ ఉండే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్. -చందు, సాక్షి వెబ్‌డెస్క్ -
మీమర్స్‌కి ఫుల్ స్టఫ్ ఇస్తున్న 'దసరా' విలన్
మార్కెట్లోకి కొత్త సరుకొచ్చింది! అవును మీరు కరెక్టేగానే విన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తెలుగు యాక్టర్స్ ఏదో ఓ పనిచేస్తారు. దానికి సంబంధించిన వీడియో బయటకొస్తుంది. మీమర్స్ అలెర్ట్ అయిపోతారు. ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తారు. అలా ఇప్పుడు వాళ్లంతా 'దసరా' విలన్ మీద పడ్డారు. అతడివి పాత వీడియోలన్నీ బయటకు తీసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నటుడు ఏం చేశాడు? (ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఎవరితడు.. బ్యాక్‌గ్రౌండ్? షైన్ టామ్ చాకో.. కేరళలోని త్రిసూర్‌లో పుట్టి పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. కమల్ అనే దర్శకుడి దగ్గర దాదాపు పదేళ్లపాటు అంటే 2002-12 మధ్య పనిచేశాడు. ఇదే డైరెక్టర్ తీసిన 'గడ్డమ్మ' మూవీతో నటుడిగా మారాడు. యాక్టర్ గా రెండు మూడేళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ వైపు విలన్ గా చేస్తూ, మరోవైపు లీడ్ రోల్ లో నటిస్తూ తనకంటా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా లాక్డౌన్లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళ సినిమాలు చాలా చూశారు. అలా షైన్ టామ్ చాకో మనవాళ్లకు పరిచయమే. గతేడాది విడుదలైన విజయ్ 'బీస్ట్'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'దసరా'తో తెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇతడు విలన్ గా చేసిన 'రంగబలి' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 'దేవర'లోనూ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇతడే బయటపెట్టాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?) విచిత్రమైన ప్రవర్తన! నటుడిగా షైన్ టాక్ చాకోని వంకపెట్టడానికి ఏం లేదు. విలన్‌గా అదరగొట్టేస్తున్నాడు. సినిమాల్లో ఇతడి పాత్రలో సీరియస్ గా భయపెట్టేలా ఉండోచ్చేమో కానీ బయటమాత్రం ఇతడు ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య 'రంగబలి' ప్రమోషన్స్ లో లేడీ యాంకర్ షర్ట్ బాగుందని చెప్పగనే.. అక్కడే విప్పి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ వీడియో దెబ్బకు గతంలో షైన్ ఫన్నీగా ప్రవర్తించిన వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. ఆ యాంకర్‌తో ఎక్కువగా తెలుగులో ఒక్క వీడియోతో షైన్ టామ్ చాకో వైరల్ అయ్యాడు గానీ మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి వీడియో చేశారంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ. ఇప్పుడు తెలుగులోనూ అలానే ఫన్ జనరేట్ చేస్తూ మీమర్స్‌కి ఫుల్ స్టప్ ఇస్తున్నాడు. ఇతడిని చూస్తున్న నెటిజన్స్.. 'ఎవర్రా బాబు నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. దిగువన అతడి వీడియోలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి. Vurey vid evad ra ila unadu 😂🤣🤣 Koru mawoo jagrathaa 🤣#Devara #NTR30 pic.twitter.com/XKRBTAqEk9 — Gsv VamsiTarak (@GsvVamsi) June 28, 2023 Tom bayya swag bolthe 😎 pic.twitter.com/ZRpEgYK6Me — Rishi (@Telugu_abbayii) June 28, 2023 Tweets are crazy on Actor #ShineTomChacko especially in Telugu audience on his off screen mannerisms..#Devarapic.twitter.com/wx76dF3Cc9 — Arjun 🪓 (@ArjunVcOnline) June 29, 2023 (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?) -
పవర్ఫుల్
ఓ నేరానికి సంబంధించిన ఆధారాల కోసం ఓ పోలీసాఫీసర్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్నారు నిత్యామీనన్. విషయం ఏంటంటే.. ఆమె ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో కథానాయికగా నటిస్తున్నారు. ‘ఆరమ్ తిరుకల్పన’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అజయ్ దేవలోక దర్శకుడు. షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘‘ఈ సంఘటన గురించి షైన్‌తో మాట్లాడినప్పుడు చాలా కొత్తగా ఉందన్నాడు. స్క్రీన్‌ప్లే ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. షైన్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. నిత్యామీనన్ పాత్ర స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అని అజయ్ దేవలోక పేర్కొన్నారు. -
కొకైన్ కేసులో హీరోకు పోలీస్ కస్టడీ
కొచ్చి: కొకైన్ కలిగి ఉన్నకేసులో అరెస్టయిన మళయాళ చిత్ర నటుడు షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలను పోలీసు కస్టడీకి అప్పగించారు. ఈ నెల 10 వరకు వారికి పోలీస్ రిమాండ్ విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. మహిళలల్లో ముగ్గురు మోడల్స్, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. కొచ్చిలోని ఓ ప్లాట్‌లో ఇటీవల షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కేరీర్ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు. -
కొకైన్‌తో పట్టుబడ్డ హీరో
కొచ్చి: కొకైన్‌ని కలిగి ఉన్న మళయాళ చిత్ర నటుడు షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మహ్మద్ నిషమ్ అనే వ్యాపారికి చెందిన ఫ్లాట్‌లో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కేరీర్ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు. చివరగా 'ఇతీహాస' చిత్రంలో ముఖ్యపాత్రలో నటించాడు. నిందితులని పోలీసులు విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.