
దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్‌పై రైడ్ చేశారు. అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్‌లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది. సెట్‌లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.
(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్)
కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.