దసరా విలన్‌ కొత్త మూవీ.. పోలీస్‌ స్టేషన్‌లో పిల్లలకు పాఠాలు చెప్తే! | Shine Tom Chacko Sutra Vakyam Movie Release Date in Telugu | Sakshi
Sakshi News home page

Sutra Vakyam Movie: పోలీస్‌ స్టేషన్‌లో పిల్లలకు పాఠాలు.. ఫస్ట్‌ మలయాళంలో, తర్వాతే తెలుగులో..

Jul 9 2025 2:34 PM | Updated on Jul 9 2025 3:03 PM

Shine Tom Chacko Sutra Vakyam Movie Release Date in Telugu

కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్‌. మలయాళం నుంచి వస్తున్న తాజా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం". దసరా విలన్‌ షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) హీరోగా నటిస్తున్నాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. 

"పోలీస్ స్టేషన్‌కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనకు.. కాస్త వినోదం జోడించి రూపొందినన చిత్రం "సూత్రవాక్యం". ఇంత గొప్ప కంటెంట్ కలిగిన "సూత్రవాక్యం" చిత్రాన్ని నిర్మించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది" అంటున్నారు "సినిమా బండి" ఫేమ్ కాండ్రేగుల లావణ్యాదేవి - కాండ్రేగుల శ్రీకాంత్!!

ఈ మూవీ మలయాళ వర్షన్‌ ఈనెల 11న విడుదలవుతోంది. "జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్" సంస్థ "సూత్రవాక్యం" పేరుతోనే తెలుగులో ఈ నెలాఖరున విడుదల చేయనుంది. రెజిన్ ఎస్.బాబు స్క్రీన్ ప్లే సమకూర్చగా శ్రీరామ్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ, జీన్ పి.జాన్సన్ సంగీతం, నితిన్ కె.టి.ఆర్ ఎడిటింగ్ చేశారు. కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్‌లో... యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో "సూత్రవాక్యం" తెరకెక్కడం గమనార్హం. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో "సూత్రవాక్యం" విడుదల కానుంది.

 

చదవండి: నేను చాలా సెల్ఫిష్‌.. ప్రజల కోసం జీవితం త్యాగం చేయలేను: కంగనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement