మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీఎంట్రీ ఇచ్చాక ఆరు సినిమాలు చేశారు. కానీ, ఆయన రేంజ్‌కు తగిన విలన్ ఏ సినిమాలో కనిపించలేదని చెప్పవచ్చు. కానీ, వాల్తేరు వీరయ్యలో ప్రకాష్ రాజ్ మాత్రమే కాస్త మ్యాచ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు ఆయన కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్‌గారు'(Mana ShankaraVaraPrasadGaru)లో విలన్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇందులో చిరు డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నట్లు టాలీవుడ్ టాక్.
ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో విలన్ పాత్ర కూడా కాస్త బ్యాలెన్స్‌గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) పేరును సెలక్ట్ చేశారని తెలుస్తోంది. దసరా చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు మంచి గుర్తింపే ఉంది పవర్‌ఫుల్ విలన్‌గా మాత్రమే కాదు మంచి కామెడీ టైమింగ్‌తో కూడా నటించగలడు. అందుకే అతన్ని ఫైనల్ చేశారని టాక్..

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఆయన కేవలం కామెడీ జోనర్ చిత్రాలే కాదు పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలడు. అయితే, 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీ మాత్రం కామెడీ, ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో రానుంది. నయనతారతో పాటు వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.


