ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా? | Sakshi
Sakshi News home page

Shine Tom Chacko: ప్రముఖ హీరో కమ్ విలన్‌కి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్

Published Tue, Jan 2 2024 3:16 PM

Dasara Movie Actor Shine Tom Chacko Engagement Pics Viral - Sakshi

ప్రముఖ విలన్.. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిపోయాడు. చాలారోజుల నుంచి ఓ అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయమై కొన్నాళ్లుగా జంటగా ఫొటోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తమ బంధం గురించి వస్తున్న పుకార్లకు తెరదించాడు. తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011 నుంచి నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షైన్.. హీరో కమ్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్‌డౌన్ టైంలో మన ఆడియెన్స్ మలయాళ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. అలా ఇతడు కూడా మనకు సుపరిచితుడు అయిపోయాడు.

(ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు)

గతేడాది నాని 'దసరా' మూవీలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి'లోనూ నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లోనూ నటిస్తున్నాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి తనూజ అనే అమ్మాయితో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

40 ఏళ్ల షైన్ టామ్ చాకో.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మరో 1-2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే షైన్ టామ్ చాకోకి ఇప్పటికే పెళ్లి అయినట్లు వికిపీడియాలో ఉంది. తబీతా అనే మహిళతో పెళ్లయిందని, వీళ్లకు ఓ బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ)

Advertisement
 
Advertisement