సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sudigali Sudheer's 'Calling Sahasra' Movie Streaming On Amazon Prime OTT Platform - Sakshi
Sakshi News home page

OTT Movie: అనూహ్యంగా ఓటీటీలో రిలీజైపోయిన సుధీర్ కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్‌తో

Published Mon, Jan 1 2024 7:03 AM

Sudigali Sudheer Calling Sahasra Movie Ott Streaming In Amazon Prime Video - Sakshi

న్యూ ఇయర్ వచ్చేసింది. భారత దేశం అంతటా అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు కొన్ని లేటెస్ట్ మూవీస్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఓ కొత్త సినిమా.. ఇలా ఓటీటీలోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. 'జబర్దస్త్'లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు. టీమ్ లీడర్ గా స్కిట్స్, యాంకర్‌గా ఈవెంట్స్ హోస్ట్ చేశాడు. ప్రస్తుతం హీరోగా మాత్రమే టచేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు 'గాలోడు' అనే మాస్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. తాజాగా 'కాలింగ్ సహస్ర' మూవీతో వచ్చాడు.

అయితే టెక్నికల్ అంశాలతో తీసిన ఈ సినిమా.. రెగ్యులర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఫ్లాప్‌గా నిలిచింది. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు బాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఎంచక్కా టైమ్ పాస్ చేసేయొచ్చు. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
 
Advertisement