న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లో ఈ వారం 25 సినిమాలు రిలీజ్.. అవి మాత్రం ప్రత్యేకం!

Published Mon, Jan 1 2024 7:45 AM

Upcoming OTT Release Movies Telugu January 1st Week 2024 - Sakshi

ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈ సోమవారంతో కొత్త సంవత్సరం మొదలైంది. 2024కి స్వాగతం పలుకుతూ తెలుగు ప్రేక్షకులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు ఈ వారమంతా కూడా ఇదే మూడ్‌లో ఉంటారు. సంక్రాంతి కానుకగా పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. దీంతో ఈ వారమైతే థియేటర్లలో చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు. దీంతో అందరి దృష్టి ఆటోమేటిక్‌గా ఓటీటీలపై పడుతుంది. 

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఇందుకు తగ్గట్లే ఈ వారం కూడా బోలెడన్ని కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు.. పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ 2 చిత్రాలు కాస్త స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ (జనవరి 01 నుంచి 07 వరకు)

నెట్‌ఫ్లిక్స్

 • బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 01
 • ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
 • మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ) - జనవరి 01
 • యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01
 • డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04
 • హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04
 • సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04
 • ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04
 • కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05
 • గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05

హాట్‌స్టార్

 • ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03
 • పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05

అమెజాన్ ప్రైమ్

 • కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా) - జనవరి 01
 • మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్) - జనవరి 01
 • ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
 • జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05
 • లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05

జీ5

 • తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05

బుక్ మై షో

 • నాల్ 2 (మరాఠీ సినిమా) - జనవరి 01
 • ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05
 • ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05
 • వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05

జియో సినిమా

 • మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03

సోనీ లివ్

 • క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05

సైనా ప్లే

 • ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05

(ఇదీ చదవండి: )

Advertisement
Advertisement