కొకైన్తో పట్టుబడ్డ హీరో | Sakshi
Sakshi News home page

కొకైన్తో పట్టుబడ్డ హీరో

Published Sat, Jan 31 2015 3:38 PM

కొకైన్తో పట్టుబడ్డ హీరో

కొచ్చి: కొకైన్ని కలిగి ఉన్న మళయాళ చిత్ర నటుడు షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మహ్మద్ నిషమ్ అనే వ్యాపారికి చెందిన ఫ్లాట్లో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కేరీర్ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు. చివరగా 'ఇతీహాస' చిత్రంలో ముఖ్యపాత్రలో నటించాడు. నిందితులని పోలీసులు విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement