
దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సూత్రవాక్యం. ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో రిలీజయ్యాక 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌కు పైగా దూసుకెళ్తోంది. థియేటర్లలో అంతగా రాణించకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి యూజీన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కండ్రాగుల నటించారు. ఈ సినిమాలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో కనిపించారు.