
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవలే ఇడ్లీ కడాయి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిత్యామీనన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీని తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే కాంతార థియేటర్లలోకి రావడంతో ఇడ్లీ కొట్టును ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.
అయినప్పటికీ కోలీవుడ్ హీరో ధనుశ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా తెలుగులోనూ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాతతో కలిసి ధనుశ్తో ఓమూవీ చేసేందుకు సంప్రదించారట. ఆయనను కలిసి కథ కూడా వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న ధనుశ్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారని లేటేస్ట్ టాక్. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. తమిళంలో ధనుశ్కు ఇచ్చేది కేవలం రూ.35 కోట్లలోపే రెమ్యునరేషన్ ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది తెలుగులో రూ.50 కోట్లు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ధనుశ్ను ఎవరు కలిశారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.