వ్యాయామం చేస్తూ కిందపడ్డ నటుడు, కాలికి గాయాలు | Veteran Actor Karthik Hospitalised, After Falling Down During Exercise | Sakshi
Sakshi News home page

Karthik: ఆస్పత్రిపాలైన సీనియర్‌ నటుడు

Jul 30 2021 12:55 PM | Updated on Jul 30 2021 12:58 PM

Veteran Actor Karthik Hospitalised, After Falling Down During Exercise - Sakshi

Karthik Hospitalised: సీనియర్‌ నటుడు కార్తీక్‌ బుధవారం ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా కార్తీక్‌ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తుండగా కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి బలంగా దెబ్బ తగలడంతో వెంటనే స్థానిక అడయార్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఇంతకుముందు ప్రమాదంలో తగిలిన కాలుకే దెబ్బ తగలడంతో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement