తండ్రిని కాదని బుల్లితెర నటుడితో పెళ్లి.. చివరికి ఏమైందంటే? | Tamil actor Rajkiran daughter Zeenat Priya separates from Munish Raja | Sakshi
Sakshi News home page

Rajkiran Daughter: బుల్లితెర నటుడితో విడాకులు.. వీడియో రిలీజ్‌ చేసిన భార్య!

Feb 1 2024 6:57 PM | Updated on Feb 1 2024 8:03 PM

Tamil actor Rajkiran daughter Zeenat Priya separates from Munish Raja - Sakshi

సినీ ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్లకే విడిపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా మరో సినీ నటుడికి అతని భార్య విడాకులిచ్చింది. గతంలో పారిపోయి బుల్లితెర నటుడు మునీశ్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె.. విడిపోయినట్లు ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. అంతే కాకుండా తన దత్త తండ్రి, నటుడు రాజ్‌ కిరణ్‍కు క్షమాపణలు చెప్పింది.

జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. నేను జీనత్ ప్రియ. రాజ్‌కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నా. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. మేం విడిపోయి కొన్ని నెలలైంది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా. నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను. అయినప్పటికీ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న' అంటూ రిలీజ్‌ చేసింది.  ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మునీష్ రాజాతో జీనత్ ప్రియ వివాహం

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్  మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది. కానీ రాజ్‌కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్‌కుమార్ అన్నారు.

దీంతో రాజ్‌కుమార్‌ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి  పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్‌కిరణ్‌పై పలు ఆరోపణలు చేసింది. తాజాగా భర్తతో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్‌ చేసి అందరికీ షాకిచ్చింది.

స్పందించిన రాజ్ కిరణ్

అయితే ఈ విషయంపై నటుడు రాజ్‌ కిరణ్ స్పందించారు. జీనత్ ప్రియ తన దత్తపుత్రిక అని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మునీష్ రాజా డబ్బు కోసం ఏదైనా చేస్తాడని రాజ్‌కిరణ్ ఆరోపించారు. తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం యత్నించాడని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement