10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్‌ మొత్తం షేక్..! | Tamil Star Vijay Varisu Movie Ranjithame Lyric Song Creates Record In Youtube | Sakshi
Sakshi News home page

Varisu Lyric Song: 10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్..!

Published Wed, Nov 16 2022 4:50 PM | Last Updated on Wed, Nov 16 2022 4:53 PM

Tamil Star Vijay Varisu Movie Ranjithame Lyric Song Creates Record In Youtube - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్‌ను ఓ రేంజ్‌లో షేక్‌ చేస్తోంది. 

(చదవండి: 'వారీసు' బిగ్ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్)

ఈ మాస్‌ సాంగ్‌ విడుదలై  పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకు ఈ పాటకు ఆదరణ మరింత పెరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల వీక్షణలు,  18 లక్షల లైక్స్‌ సొంతం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సాంగ్ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ  సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement