భార్య ఉండగా నటుడి రెండో పెళ్లి.. DNA రిపోర్ట్‌తో నిజం బయటకు! | Joy Crizildaa: DNA test Confirmed Madhampatty Rangaraj is father of Her Son | Sakshi
Sakshi News home page

Joy Crizildaa: DNA రిపోర్ట్‌తో బయటపడ్డ నటుడి నిజస్వరూపం!

Apr 2 2026 12:41 PM | Updated on Apr 2 2026 1:07 PM

Joy Crizildaa: DNA test Confirmed Madhampatty Rangaraj is father of Her Son

ప్రముఖ చెఫ్‌, నటుడు మాధంపట్టి రంగరాజ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాయ్‌ క్రిజిల్డాను ఏడాదిన్నర క్రితం సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలి మెడలో తాళి కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానీ వీరి బంధం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. రంగరాజ్‌.. ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దీంతో జాయ్‌.. తన పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అంతేకాకుండా తాను ఆరోనెల గర్భిణీ అని ప్రకటించింది. అయితే కడుపులో బిడ్డకు, తనకు సంబంధం లేదని పారిపోయే ప్రయత్నం చేశాడు నటుడు.

DNA టెస్ట్‌
దీంతో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్‌.. నువ్వేం తండ్రివి అని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగరాజ్‌ మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. డీఎన్‌ఏ టెస్టులో బాబుకు తనే తండ్రినని తేలితే దేనికైనా రెడీ అని సవాలు విసిరాడు రంగరాజ్‌. ఈ క్రమంలో కోర్టు సమక్షంలో వీరికి డీఎన్‌ఏ టెస్టు నిర్వహించారు. తాజాగా వాటి ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చాయంటోంది జాయ్‌. డీఎన్‌ఏ రిపోర్టులో తన బిడ్డకు తండ్రి రంగరాజే అని తేలిందని వెల్లడించింది.

పోస్ట్‌ డిలీట్‌
ఇలా ఎన్ని టెస్టులు చేసినా విజయం ఎప్పుడూ తల్లిదేనని రాసుకొచ్చింది. ఈ పోరాటంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. గర్భం దాల్చినప్పటి నుంచి రాఘ పుట్టేవరకు ఎన్నో కష్టాలు చూశాను. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. నా కొడుకు కోసం ధృడంగా నిలబడ్డాను. నా బిడ్డ అన్యాయమైపోకూడదని న్యాయ పోరాటం చేశాను. ఈరోజు నేను గెలిచాను అని పేర్కొంది. కానీ కాసేపటికే ఈ పోస్టును డిలీట్‌ చేసింది.

సినిమా
కాగా రంగరాజ్‌.. కూకు విత్‌ కోమలి రియాలిటీ షో జడ్జిగా పాపులర్‌ అయ్యాడు. మెహందీ సర్కస్‌, పెంగ్విన్‌ సినిమాల్లో నటించాడు. ఇతడు లాయర్‌ శృతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. జాయ్‌ క్రిజిల్డా విషయానికి వస్తే దాదాపు పాతిక సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌, స్టైలిస్ట్‌గా పని చేసింది. విజయ్‌, శివకార్తికేయన్‌, ప్రభుదేవా, అనిరుధ్‌ రవిచందర్‌, రెజీనా.. ఇలా ఎందరో సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్‌గా వర్క్‌ చేసింది. జాయ్‌.. 2018లో జేజే ఫ్రెడరిక్‌ను పెళ్లి చేసుకోగా వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల కిందట రంగరాజ్‌, జాయ్‌ క్రిజిల్డా ప్రేమలో పడ్డారు. దీంతో భార్య ఉండగానే జాయ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే ఆమె పర్సనల్‌ ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించడం వల్లే పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు.

 

 

చదవండి: ఏడాదిగా ట్రెండింగ్‌లో తమిళ్‌ సాంగ్‌.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement