ఎవరినీ ప్రేమించలేదు.. పెళ్లి ఆలోచన ఇప్పుడు లేదు: హీరోయిన్‌ | Nikhila Vimal Open About Her Marriage Rumours | Sakshi
Sakshi News home page

ఎవరినీ ప్రేమించలేదు.. పెళ్లి ఆలోచన ఇప్పుడు లేదు: హీరోయిన్‌

Jun 6 2026 8:48 AM | Updated on Jun 6 2026 8:56 AM

Nikhila Vimal Open About Her Marriage Rumours

ఈ తరం హీరోయిన్ల ఆలోచనా ధోరణియే వేరు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నారనే చెప్పాలి. ప్రేమ, పెళ్లి విషయం ఎత్తితేనే అందుకు చాలా సమయం ఉందంటున్నారు. యంగ్‌ హీరోయిన్‌ నికిలావిమల్‌ ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో బాల నటిగా పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో కథానాయికిగా నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి శ్రమిస్తున్నారు. 

తమిళంలో వెట్రివేల్‌, కిడారి, పంచుమిట్టాయి, తంబి, పోర్‌ తొళిల్‌ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల మారిసెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన వాళై చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళం తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నికిలా విమల్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరని, తానెవరినీ ప్రేమించడం లేదని తెలిపారు. 

పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ప్రేమ, పెళ్లి వంటివి పెద్ద విషయం కాదు అని, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు చూసుకో వచ్చునని అన్నారు. ఇప్పుడు తన ఆలోచనలు అంతా సినిమా చుట్టూనే అని నికిలా విమల్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement