కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్న జయం రవి సుమారు 15 ఏళ్ల పాటు కలిసి జీవించారు
ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతోనే విడాకులు తీసుకున్నట్లు సమాచారం
వీరిద్దరికి అర్వ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
సుమారు ఆరు నెలలుగా వేరువేరుగా ఉంటున్న జయం రవి, ఆర్తి
జయం రవి తెలుగు వారికి కూడా బాగా పరిచయం.. ఆయన ఎడిటర్ మోహన్ కుమారుడనే విషయం తెలిసిందే.
తన సతీమణితో కలిసే విడాకుల నిర్ణయం తీసున్నట్లు తెలిపిన జయం రవి
విడాకులు తీసుకోవడంలో చాలా భారంగా అనిపించినప్పటికీ తప్పని పరిస్థితిల్లో ఈ నిర్ణయానికొచ్చామని ఆయన అన్నారు.
ఈ సమయంలో తన ప్రైవసీతో పాటు తన సన్నిహితుల గోప్యతను అందరూ గౌరవించాలని ఆయన కోరారు.


