గాఢంగా ప్రేమించిన ప్రియుడు మరో అమ్మాయితో.. బ్రేకప్‌పై స్పందించిన నటుడి భార్య

Break Up with Shanthanu, Kiki Vijay Broke The Secret - Sakshi

శాంతను భాగ్యరాజ్‌.. తండ్రి భాగ్యరాజ్‌ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఇతడు తర్వాతి కాలంలో హీరోగా మారాడు. సక్కరకత్తి సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.  ఇటీవలే రావణ కొట్టంతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం అతడు బ్లూ స్టార్‌ సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగులో మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా అతడు తన భార్య ​కికి విజయ్‌తో కలిసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముందుగా శాంతను మాట్లాడుతూ.. 'మేము ప్రేమించుకుంది, బ్రేకప్‌ చెప్పుకుంది రెండూ వాస్తవమే! ఎనిమిదేళ్లు దూరంగా ఉన్నాం. ఆ తర్వాత ఓ సందర్భంలో మరోసారి లవ్‌లో పడ్డాం. అప్పట్లో చిన్నచిన్న విషయాలను కూడా బాగా గొడవపడేవాళ్లం' అని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

కికి మాట్లాడుతూ.. 'శాంతనుతో లవ్‌లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది.. నాకిప్పటికీ బాగా గుర్తుంది. నా స్నేహితురాలు ఒకరు ఫోన్‌ చేసి శాంతను వేరే అమ్మాయితో కాఫీ షాప్‌లో ఉన్నాడని చెప్పింది. నేను వెంటనే శాంతనుకు కాల్‌ చేసి నువ్వెక్కడ ఉన్నావ్‌? అని ఆరా తీశాను. అతడు తన తండ్రితో ఉన్నానని అబద్ధం చెప్పాడు. ఇలా మా మధ్య చిన్న చిన్నవే పెద్ద గొడవలుగా మారాయి. మేము బ్రేకప్‌ చెప్పుకున్నాం. 8 ఏళ్లు విడివిడిగానే జీవించాం. కానీ ఓ షోలో ఇద్దరం కలిసి డ్యాన్స్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మళ్లీ కలిసిపోయాం' అని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: అన్న సమాధి దగ్గర భార్య సీమంతం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top