Dhruva Sarja: అన్న సమాధి దగ్గర భార్య సీమంతం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో భార్య

Dhruva Sarja, Prerana Blessed With Baby Girl - Sakshi

కన్నడ హీరో ధ్రువ సర్జా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ధ్రువ సర్జా- ప్రేరణ శంకర్‌ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వినాయక చవితి(సెప్టెంబర్‌ 18న) రోజు ప్రేరణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ధ్రువ సర్జా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 'సాధారణ ప్రసవం జరిగింది. బేబీ పుట్టింది' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా ఇటీవల ధ్రువ సర్జా.. తన భార్యకు ఘనంగా సీమంతం ఫంక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే! శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే తన భార్యకు సీమంత వేడుక నిర్వహించాడు. ఈ వేడుకను తన అన్నయ్య స్వర్గీయ చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో సెలబ్రేట్‌ చేశాడు. అన్నయ్య ఆశీర్వాదాలు తన కుటుంబానికి ఉండాలనే ఈ విధంగా సెలబ్రేషన్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

చదవండి: అసిస్టెంట్ పెళ్లిలో ధనుశ్ సందడి.. వీడియో వైరల్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top