
వారసత్వంతో వచ్చి హీరోలు, నటులు అయినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొందరు యాక్టర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు సూరి ఒకడు. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.
1998లో తమిళ ఇండస్ట్రీలోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు దక్కని చాలా పాత్రలు చేశాడు. 2004 నుంచి ఆడపాదడపా పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు చేశాడు. 2022 వరకు అంటే దాదాపు 18 ఏళ్ల పాటు కామెడీ పాత్రలు చేశాడు.
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు)
అందరూ సూరిలో కమెడియన్ ని చూస్తే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం అద్భుతమైన నటుడిని చూశాడు. అలా 'విడుదల పార్ట్ 1' మూవీతో సూరిని హీరోగా లాంచ్ చేశాడు. తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో సూరి ఆకట్టుకున్నాడు. 'మామన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తొలి పని-జీతం, దాని ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల్ని చెప్పుకొచ్చాడు.
'తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం ఖర్చు పెట్టి, మిగతాది ఇంటికి పంపేవాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను' అని సూరి చెప్పుకొచ్చాడు. అప్పుడు రూ.20 జీతానికి పనిచేసిన ఇతడు.. ఇప్పుడు కష్టపడి నటుడిగా ఎదిగి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
(ఇదీ చదవండి: సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్)
"I stated as a daily Wager in Tiruppur & my wages was ₹20 per day. Weekly I get ₹140, I will spend ₹70 & send back ₹70 to my home. I got to learn about the life lessons there🫶"
Growth of #Soori🫡♥️pic.twitter.com/2PflFhYz4o— AmuthaBharathi (@CinemaWithAB) May 14, 2025