
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కడలూరు ప్రమాదంపై స్పందించారు. ఇవాళ తమిళనాడులో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ ఘటనకు కారణం ఎవరైనా ఇది క్షమించరానిది అని ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ కోరారు.
కమల్ హాసన్ తన ట్వీట్లో రాస్తూ..' ఇది చాలా హృదయ విదారక వార్త. కడలూరు-సెమ్మంగుప్పం రైల్వే లైన్‌లో పాఠశాలకు వెళ్తున్న పిల్లల బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి. తమ పిల్లలను కోల్పోయినందుకు బాధపడుతున్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అంటూ సంతాపం తెలియజేశారు.
కాగా.. ఇవాళ ఉదయం తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్‌మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.
இதயத்தைப் பதைக்க வைக்கும் செய்தி. கடலூர் செம்மங்குப்பம் ரயில் பாதையில் பள்ளிக்குச் சென்ற ஒன்றுமறியா இளங்குருத்துகள் ரயில் மோதி இறந்ததை ஒப்பவே மனம் மறுக்கிறது. எவரின் அலட்சியமாக இருந்தாலும் இது மன்னிக்கத் தகுந்ததே அல்ல.
ஏற்றுக்கொள்ளவே முடியாத துக்கம் நிகழ்ந்திருக்கிறது. இனியும்…— Kamal Haasan (@ikamalhaasan) July 8, 2025