breaking news
kadaluru
-
'హృదయ విదారకం.. నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది'.. కమల్ హాసన్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కడలూరు ప్రమాదంపై స్పందించారు. ఇవాళ తమిళనాడులో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ ఘటనకు కారణం ఎవరైనా ఇది క్షమించరానిది అని ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ కోరారు.కమల్ హాసన్ తన ట్వీట్లో రాస్తూ..' ఇది చాలా హృదయ విదారక వార్త. కడలూరు-సెమ్మంగుప్పం రైల్వే లైన్లో పాఠశాలకు వెళ్తున్న పిల్లల బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి. తమ పిల్లలను కోల్పోయినందుకు బాధపడుతున్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అంటూ సంతాపం తెలియజేశారు.కాగా.. ఇవాళ ఉదయం తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్మేన్ పంకజ్శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. இதயத்தைப் பதைக்க வைக்கும் செய்தி. கடலூர் செம்மங்குப்பம் ரயில் பாதையில் பள்ளிக்குச் சென்ற ஒன்றுமறியா இளங்குருத்துகள் ரயில் மோதி இறந்ததை ஒப்பவே மனம் மறுக்கிறது. எவரின் அலட்சியமாக இருந்தாலும் இது மன்னிக்கத் தகுந்ததே அல்ல.ஏற்றுக்கொள்ளவே முடியாத துக்கம் நிகழ்ந்திருக்கிறது. இனியும்…— Kamal Haasan (@ikamalhaasan) July 8, 2025 -
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 70 మందికి గాయాలు.
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 70 మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేట్ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ముందుగా ఒక బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులు నజ్జునుజ్జుయినట్లు తెలుస్తోంది. ఘటనపై స్పందించిన సీఎం స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
పరువు హత్య కేసులో సంచలన తీర్పు: ఉరే సరి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కులాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలు అంగీకరిచకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అహం దెబ్బతినడంతో ఇరు కుటుంబాల వారూ కూడబలుక్కుని ఆ జంటను అతి కిరాతకంగా హతమార్చారు. నేరం రుజువుకావడంతో ఒకరికి ఉరిశిక్ష, రిటైర్డ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ సహా 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ కేసు వివరాలు కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని కుప్పందత్తానికి చెందిన స్వామికన్ను కుమారుడు మురుగేశన్ (25) బీఈ కెమికల్ ఇంజినీరింగ్ చేశాడు. దళితుడైన మురుగేశన్ అదే ప్రాంతంలో మరో సామాజిక వర్గానికి చెందిన దురైస్వామి కుమార్తె కన్నగి (22) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల వారు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో 2003 మే 5వ తేదీ కడలూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరిళ్లలో వారు వేర్వేరుగా గడిపేవారు. ఓ దశలో ఇరువురు ఇంటి నుంచి పారిపోయారు. మురుగేశన్ తన భార్య కన్నగిని విళుపురం జిల్లాలోని బంధువుల ఇంట్లో ఉంచి కడలూరు జిల్లాల్లోని తన బంధువుల ఇంటిలో ఉండేవాడు. మురుగేశన్ బాబాయ్ అయ్యాస్వామి సహకారంతో కన్నగి తల్లిదండ్రులు 2003 జూలై 8వ తేదీ ఇద్దరినీ ఇంటికి తెచ్చుకున్నారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఆ తరువాత మరికొందరితో కలిసి మురుగేశన్, కన్నగిలను కుప్పందత్తం గ్రామ శ్మశానికి తీసుకెళ్లి ముక్కు, చెవుల ద్వారా విషాన్ని ప్రవేశపెట్టి హతమార్చారు. వారిద్దరి శవాలను అదే శ్మశానంలో తగులబెట్టారు. మురుగేశన్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దారుణాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో మార్మోగిపోవడంతో కేసు నమోదు చేసి ఇరుపక్షాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. జాతివిధ్వేషాలతో జరిగిన హత్యలు కావడంతో పలువురి డిమాండ్ మేరకు 2004లో ఈ కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి విరుదాచలం ఇన్స్పెక్టర్ చెల్లముత్తు, సబ్ ఇన్స్పెక్టర్ తమిళ్మారన్ సహా 15 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీటు దాఖలు చేసింది. మొత్తం 81 మంది సాక్షులను విచారించగా వీరిలో సెల్వరాజ్ అనే సాక్షి ఆత్మహత్య చేసుకున్నాడు. కడలూరు జిల్లా ఎస్సీ ఎస్టీ విభాగం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తమ్రాజా ఈ కేసుపై శుక్రవారం తీర్పు చెప్పారు. కన్నగి అన్న మరుదుపాండికి ఉరిశిక్ష, తండ్రి దురైస్వామి, ఇరుపక్షాల బంధువులు రంగస్వామి, కందవేలు, జ్యోతి, వెంకటేశన్, మణి, ధనవేల్, అంజాపులి, రామదాస్, చిన్నదురై, తమిళ్మారన్, అప్పటి సీఐ చెల్లముత్తు, (ప్రస్తుతం విశ్రాంత డీఎస్పీ), ఎస్ఐ తమిళ్మారన్ (సీఐగా సస్పెన్షన్) సహా మొత్తం 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరిలో కన్నగి తండ్రి దురైస్వామి సహా ఐదుగురికి రెండు యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 15 మంది నిందితుల్లో మురుగేశన్ తరఫు అయ్యాస్వామి, గుణశేఖరన్లను నిర్దోషులుగా విడిచిపెట్టారు. -
నదిలో కొట్టుకుపోయి 10 మంది మృతి
తమిళనాడు: తమిళనాడులో రీవాను తుపాను దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కడలూరు సమీపంలోని కట్టారు నది ఉధృతికి 150 పడవలతో పాటు10 మంది కొట్టుకు పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. తుపానుతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. రవాణా వ్యవస్ధకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.