మొన్న శృతిహాసన్.. నేడు మార్కో హీరో.. సోషల్ మీడియా హ్యాక్! | Unni Mukundan Instagram hacked actor warns to fans suspicious activity | Sakshi
Sakshi News home page

Unni Mukundan: మార్కో హీరో సోషల్ మీడియా ఖాతా హ్యాక్.. ఫ్యాన్స్‌కు నటుడు అలర్ట్!

Jul 8 2025 3:28 PM | Updated on Jul 8 2025 5:29 PM

Unni Mukundan Instagram hacked actor warns to fans suspicious activity

ఇటీవల ఎక్కువగా సినీతారల సోషల్ మీడియా ఖాతాలే టార్గెట్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శృతిహాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంభందించిన లింక్స్ దర్శనమిచ్చాయి. అయితే తాజాగా మరో హీరో సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిమానులను హెచ్చరించారు. ఏదైనా సందేశాలు వస్తే వాటికి రెస్పాండ్ కావొద్దని ఫ్యాన్స్‌కు సూచించారు. ప్రస్తుతం దీనిపై తన టీమ్‌ సభ్యులు పని చేస్తున్నారని.. అకౌంట్ రికవరీ అయ్యాక తానే అప్‌డేట్ ఇస్తానని అభిమానులకు అలర్ట్ చేశారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.

మలయాళ స్టార్‌ ఉన్ని ముకుందన్‌ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్‌ వయొలెంట్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే మార్కో చిత్రంలో వయొలెన్స్‌ విపరీతంగా ఉందని కొందరు విమర్శలు కూడా చేశారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా కూడా ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ అలాంటిదేం లేదని ఇటీవలే కొట్టపారేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement