ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి | Tamil Actor Soori Comments His Fans | Sakshi
Sakshi News home page

ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి

May 18 2025 8:00 AM | Updated on May 18 2025 8:00 AM

Tamil Actor Soori Comments His Fans

తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్‌. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్‌లో విడుదలైంది.  మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్‌ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో  కుమారస్వామి  ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు  మామన్‌ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. 

ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్‌ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. 

ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ  వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్‌ న్యూస్‌ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement