కోర్ట్‌లో తప్పు ఒప్పుకొన్న నటుడు శ్రీకాంత్ | Tamil Actor Srikanth Drug Case And Latest Update | Sakshi
Sakshi News home page

Srikanth: శ్రీకాంత్‌కు రిమాండ్.. మరో నటుడి కోసం పోలీసులు గాలింపు

Jun 25 2025 12:50 PM | Updated on Jun 25 2025 12:56 PM

Tamil Actor Srikanth Drug Case And Latest Update

తమిళ నటుడు శ్రీకాంత్.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో హాజరు పరచగా.. తను చేసిన తప్పుని ఒప్పుకొన్నాడు. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తు పదార్థలు అలవాటు చేశాడని న్యాయస్థానానికి విన్నవించాడు. ప్రసాద్ తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, డబ్బు అడిగిన ప్రతిసారి ఆయన కొకైన్ ఇచ్చేవాడని, అలా తనకు అది అలవాటు అయిపోయిందని శ్రీకాంత్ అన్నాడు.

(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్?)

తాను డ్రగ్స్ అమ్మలేదని, కేవలం తీసుకున్నానని శ్రీకాంత్ చెప్పాడు. తీసుకోవడం తప్పని తనకు తెలుసని, బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరాడు. కానీ న్యాయస్థానం శ్రీకాంత్ అభ్యర్థని తిరస్కరించింది. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ఇక ఇదే కేసుతో సంబంధమున్న నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. దొరకగానే అతడిని కూడా అరెస్ట్ చేయనున్నారు.

'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న శ్రీకాంత్.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దాదా, స్టాప్ లాంటి స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీస్ చేశాడు. దళపతి విజయ్ 'స్నేహితుడు' చిత్రంలోనూ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇతడు కాస్త డౌన్ అయ్యాడు. ఈ ఏడాది శ్రీకాంత్ చేసిన రెండు తమిళ మూవీస్, ఓ తెలుగు సినిమా 'ఎర్రచీర' రిలీజైంది. కాకపోతే అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే గనుక)

Advertisement
 
Advertisement
Advertisement