
తమిళ నటుడు ప్రేమ్ కుమార్ (Tamil Actor Prem Kumar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ప్రేమ్‌కుమార్ తనయుడు కౌశిక్ సుందరం.. పూజిత మెడలో తాళికట్టాడు. వీరిద్దరి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రేమ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. రెక్కలు విప్పుకుని ఎదిగే కొడుకుని చూస్తుంటే తండ్రికి ఎంతో గర్వంగా ఉంటుంది.
ఎంతో ప్రత్యేకం..
ఆగస్టు 28 మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా కొడుకు పెళ్లి అనే బంధంతో జీవితంలో ముందడుగు వేశాడు. అది చూసి తండ్రిగా నా మనసు ఉప్పొంగిపోతోంది. నూతన వధూవరులు కౌశిక్- పూజిత జంట సుఖసంతోషాలతో కలకాలం కలిసుండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరిద్దరూ గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఈ పెళ్లి వేడుకకు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించినవారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

సినిమా
ఈ పెళ్లి వేడుకకు హీరో శివకార్తికేయన్ హాజరయ్యాడు. రిసెప్షన్ కార్యక్రమానికి హీరో కార్తీ అటెండయ్యాడు. ప్రేమ్ కుమార్.. ధనం, గురుసామి, బిర్యానీ, ఖిలాడీ, సర్కార్, కాపన్, విక్రమ్ వేద, హీరో, మాస్టర్, తునివు(తెగింపు), కంగువా, రెట్రో.. వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఈనాడు (2009) సినిమాలో ఫ్రాన్సిస్‌గా యాక్ట్ చేశాడు. ఓటీటీలో సుడల్: ద వోర్టెక్స్ వెబ్ సిరీస్‌లో మెరిశాడు.
As a parent, nothing rivals the feeling of pure pride in watching your kid grow and spread their wings in their life with style. In that regard, 28th of August will always be a very special day for our family.
My boy took a very big step yesterday, and as a father, my heart is… pic.twitter.com/POfWmAljRw— Prem Kumar (@premkumaractor) August 29, 2025
చదవండి: స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. చేజారడంతో ఏడ్చేశా: ప్రేమలు బ్యూటీ