
ప్రేమలు సినిమాతో సెన్సేషన్ అయింది మమిత బైజు (Mamitha Baiju). ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్‌తో, దళపతి విజయ్‌తో సినిమాలు చేస్తోంది. అయితే ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంటోందీ బ్యూటీ. నాకు పెద్దగా గుర్తింపు లభించని సమయంలో హీరో సూర్య సర్‌తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎగిరి గంతేశాను. కానీ, దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. అప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కానీ ఇప్పుడు సూర్య సర్‌తో ఓ సినిమా చేస్తున్నందుకు చాలా థ్రిల్ ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.
అప్పుడు మిస్సయిన ఛాన్స్..
బాలా డైరెక్ట్ చేసిన వణంగాన్ మూవీలో మొదట సూర్య, మమిత బైజును సెలక్ట్ చేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. కానీ పలు కారణాల వల్ల సూర్య, మమిత బైజు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకుడు బాలా.. అరుణ్ విజయ్‌ను హీరోగా పెట్టి సినిమా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.