'ప్రేమిస్తే' ఆడిషన్‌కు గ్రీజు పూసుకుని వెళ్లా.. అప్పుడుకానీ..! | Actor Bharath recalls how Balaji Sakthivel Doubts on him in Kaadhal | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే.. హీరోగా నేను కరెక్టేనా అని డౌట్‌ పడ్డారు: భరత్‌

Mar 30 2026 11:42 AM | Updated on Mar 30 2026 11:52 AM

Actor Bharath recalls how Balaji Sakthivel Doubts on him in Kaadhal

తమిళ హీరో భరత్‌.. బాయ్స్‌, ప్రేమిస్తే, స్పైడర్‌, హంట్‌ సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు. ప్రస్తుతం ఇతడు 'కాళిదాస్‌ 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అతడు కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన ఓ అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు. భరత్‌ మాట్లాడుతూ... దర్శకుడు బాలాజీ శక్తివేల్‌ నాకు కాదల్‌ (తెలుగులో ప్రేమిస్తే పేరిట డబ్‌ అయింది) కథ చెప్పాడు. 

హీరో ఎంపిక కరెక్టేనా?
చిన్న టౌన్‌లో మెకానిక్‌ పనిచేసుకునే అబ్బాయిగా నటించాల్సి ఉంటుందని పాత్ర పరిచయం చేశాడు. నేను కూడా ఒప్పుకున్నాను. తీరా దర్శకుడు హీరోగా నేను కరెక్టేనా? అన్న డైలమాలో పడ్డాడు. నా రంగు, మాటతీరు.. అన్నీ సిటీ అబ్బాయి లక్షణాలే ఉన్నాయి.. పక్కా పల్లెటూరి భాష మాట్లాడే మెకానిక్‌ రోల్‌కు సెట్‌ అవుతానా? లేదా? అన్న అనుమానం ఆయన మెదడును తొలిచేసింది.

అదే వీధిలో ఇల్లు కొన్నా..
నేనేమో ఎలాగైనా ఈ సినిమా చేయాలనుకున్నాను. ముఖానికి గ్రీజు పూసుకుని ఆడిషన్‌కు వెళ్లాను. పైగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారిలాగే మాట్లాడాను. నా తాపత్రయం నిర్మాత ఎస్‌.శంకర్‌కు అర్థమైంది. ఆయన ఆఫీసులోనే స్క్రీన్‌ టెస్ట్‌ చేసి ఫైనల్‌ చేశారు. అలా కాదల్‌ మూవీ చేయగా, మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆ ఆఫీస్‌ ఉన్న వీధిలోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. అదెంతో గర్వకారణంగా అనిపించింది అని భరత్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: నేను సినిమాలు చూడను: ఆమిర్‌ ఖాన్‌

Advertisement
 
Advertisement
Advertisement