
మరో ప్రముఖ నటుడు పెళ్లి చేసుకున్నాడు. తమిళంలో 'పొన్నియిన్ సెల్వన్', 'థగ్ లైఫ్' తదితర చిత్రాల్లో నటించిన ఇతడు.. ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. ఆర్కిటెక్ట్ జయశ్రీ చంద్రశేఖరన్‌తో ఏడడుగులు వేశాడు. ఆదివారం ఉదయం ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)
చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ చిదంబరం.. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2015లో వచ్చిన 'మూణే మూణు వార్తై' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత రమ్, నేర‍్కొండ పార్వై, తీవిరమ్, పొన్నియిన్ సెల్వన్, అనీతి, కొలాయి, రత్తం, థగ్ లైఫ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెరికా మాప్పిలై, ఆటో శంకర్, బిహైండ్ కోజ్డ్ డోర్, అద్ధం, ద విలేజ్ వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశాడు. ఇక పెళ్లి కూతురు జయశ్రీ చంద్రశేఖర్ విషయానికొస్తే ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ప్రస్తుతం ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దల కుదిర్చిన పెళ్లి? అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి)