breaking news
Return Of The Dragon Movie
-
2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్‌లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్‌డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.ఫస్టాఫ్‌లో టాప్ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్ 5లో ఏమున్నాయ్?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్ నుంచి 3 సినిమాలుబాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్‌గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా.. -
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
కొన్నిసార్లు ఒక్క సినిమాతో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అలా కొన్నిరోజుల క్రితం రిలీజైన 'డ్రాగన్'తో కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. (ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) అసోంకు చెందిన కాయదు లోహర్.. 'అల్లూరి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళంలో ప్రయత్నించగా.. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్'లో అవకాశమొచ్చింది. ఇదే మూవీతో కాయదుకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.ఈ క్రమంలోనే తెలుగులో విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో తీస్తున్న 'ఫంకీ'లో కాయదు హీరోయిన్ గా సెలెక్ట్ కాగా.. ఇప్పుడు తమిళ హీరో శింబు సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీస్ కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో కాయదు లైఫ్ సెట్ అయిపోయినట్లే!(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెళ్లి కాని ప్రసాద్, టుక్ టుక్ తదితర కొత్త సినిమాలతో పాటు సలార్, ఎవడే సుబ్రమణ్యం లాంటి పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి రెండు రోజుల్లో 12 మూవీస్ వచ్చేశాయి.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)ఓటీటీల్లోకి ఈ శుక్రవారం వచ్చిన వాటిలో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. అలానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ, బ్రహ్మానందం మూవీస్ కూడా మీరు ప్రయత్నించొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ ఉన్నాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మార్చి 21)నెట్ ఫ్లిక్స్రిట్నర్ ఆఫ్ ద డ్రాగన్ - తెలుగు సినిమాలిటిల్ సైబీరియా - ఫినిస్ మూవీరివిలేషన్స్ - కొరియన్ సినిమాఆఫీసర్ ఆన్ డ్యూటీ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)అమెజాన్ ప్రైమ్నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడీ కోబమ్ - తమిళ సినిమాస్కై ఫోర్స్ - హిందీ మూవీహాట్ స్టార్కన్నెడ - హిందీ సిరీస్ఆహాబ్రహ్మానందం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)రింగ్ రింగ్ - తమిళ మూవీ సన్ నెక్స్ట్బేబీ అండ్ బేబీ - తమిళ సినిమాఆపిల్ ప్లస్ టీవీబార్బరిక్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ) -
ఓటీటీలో హిట్ సినిమా 'డ్రాగన్' ఎంట్రీ
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ (Return Of The Dragon) ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు.తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ‘లవ్‌టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది: డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్
హీరోయిన్ కయాదు లోహార్ ఇటీవలే డ్రాగన్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. 21 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ముగిల్‌పేటతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత మలయాళంలో పథోన్పత్తం నూత్తాండు అనే చిత్రంలో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 2022లోనే శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతే కాకుండా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో కనిపించింది. దక్షిణాది అన్ని భాషల్లో అడుగుపెట్టిన డ్రాగన్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుందిం. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.డ్రాగన్ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది ఈ అస్సాం బ్యూటీ. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరోతో పని చేసిన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ లాంటి కో స్టార్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ మూవీతో నాకు నిజమైన స్నేహితుడు దొరికాడని సంతోషం వ్యక్తం చేసింది. అయితే మొదట ఈ సినిమాలో ఛాన్స్ రాదేమోనని బాధపడ్డానని కయాదు లోహర్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది.కయాదు లోహర్ ఇన్‌స్టాలో రాస్తూ..'మొదట జూమ్ కాల్లో డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు కీర్తి క్యారెక్టర్‌కు సంబంధించిన కథ చెప్పారు. అది విని చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ ఆ తర్వాత అతని నుంచి నాకు రిప్లై రాలేదు. దీంతో నేను ఆ ప్రాజెక్ట్‌ను కోల్పోయానేమో అని కొంచెం బాధపడ్డా. కానీ ఒక నెల తరువాత అశ్వత్ మళ్లీ నాతో టచ్‌లోకి వచ్చారు. రెండోసారి పల్లవి పాత్ర కోసం నాకు నేరేషన్ ఇచ్చారు. నేరేట్ చేయడం పూర్తి చేసిన తర్వాత మీటింగ్ ముగించి ఆయన వెళ్లిపోవడంతో కాస్త కంగారు పడ్డా. కానీ 5 నిమిషాల్లోనే తిరిగి వచ్చి పల్లవిగా నిన్ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయని' తెలిపింది.ఆ తర్వాత తాను పల్లవి పాత్రలో అద్భుతంగా చేసి చూపిస్తానని ఆయనకు ప్రామిస్ చేశా.అశ్వత్ మరిముత్తు సినిమాలో స్త్రీ పాత్రలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథను రెండుసార్లు విని.. పల్లవి పాత్రను అర్థం చేసుకున్న తర్వాత ఈ చిత్రంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నా. పల్లవి పాత్ర నాకు ఇచ్చినందుకు అశ్వత్‌కు ధన్యవాదాలు. నాకు అద్భుతమైన పాత్రతో అరంగేట్రం ఇచ్చినందుకు. మీకు నటుల పట్ల మీకు ఉన్న ప్రేమ, వారికి ఉత్తమమైన పాత్రలు అందించడం, వేరే దేని గురించి ఆలోచించకుండా పూర్తిగా సినిమాపై ప్రేమ పని చేస్తారు. ఈ విషయంలో మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని' పోస్ట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ గురించి రాస్తూ..' ప్రదీప్ లాంటి కో స్టార్ దొరకడం చాలా అరుదు. ఈ సినిమాతో నాకు నిజమైన స్నేహితుడు లభించాడు. అతని అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు నా మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేమిద్దరం సెట్లో మాట్లాడుకోవడం.. కథ గురించి చర్చించుకోవడం.. మా ఇద్దరి మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రదీప్ సార్ మీరు సూపర్ టాలెంటెడ్.. అద్భుతమైన నటుడు మీరు' అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది. View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్‌మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ అధికారిక సోషల్‌మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
'డ్రాగన్' నా లైఫ్‌లో జరిగిందే.. మనీ అడగాలంటే సిగ్గనిపించింది: డైరెక్టర్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు సక్సెస్ బాట పడతాయి. ఇటీవల వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) కూడా అదే కోవలోకి వస్తుంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా హిందీలోనూ విడుదలకు సిద్ధమైంది. ముందడుగుఈ విషయాన్ని హీరో ప్రదీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మార్చి 14న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిందీలో రిలీజవుతోంది. నా సినిమాలు దేశమంతటా చూడాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. నా ఆలోచనలు ఆచరణలో అమలయ్యేందుకు తొలి అడుగు పడింది. షారూఖ్ ఖాన్ సర్, సల్మాన్ ఖాన్ సర్, ఆమిర్ ఖాన్ సర్.. మీరందరూ పక్కకు జరగండి.. నేను వస్తున్నా అని సరదాగా ట్వీట్ చేశాడు.అంత పెద్దోడివైపోయావా?ఇది చూసిన నెటిజన్లు.. ఏంటి, బాలీవుడ్ హీరోలకే ధమ్కీ ఇస్తున్నావా? అంత పెద్దవాడివైపోయావా?, ఏదేమైనా హిందీలో రీమేక్ చేయకుండా డబ్బింగ్ చేసి మంచి పని చేశారు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. డ్రాగన్ సినిమా తన నిజ జీవితానికి సంబంధించిందని చిత్రదర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపాడు. సినిమాలోని ఆ బ్యాచిలర్ రూమ్ నేను నివసించిందే!'కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతుంటాం. వాళ్లెవరో కాదు మన స్నేహితులే! డ్రాగన్ సినిమాలో చూపించే బ్యాచిలర్ రూమ్ లైఫ్ నా నిజజీవితంలోనిదే! కేవలం పాత్రలు మాత్రమే కాదు ఆ ప్లేస్ కూడా నేను నివసించిందే.. ఇగీ, పంబు, అంబు, అజయ్, కరుప్స్, బాలాజీ, జై, మురళి, జాన్, గ్లెన్, హరి, విక్కీ.. మేమంతా కాలేజీ ఫ్రెండ్స్. అందరం రూమ్ తీసుకుని ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక జీరోఇందులో కొందరు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. సినిమాలో చూపించినట్లే కాలేజ్ అయిపోయాక నేను జీరోనయ్యాను. కానీ నాలో టాలెంట్ ఉందని నమ్మి నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు. వాళ్లు కష్టపడి సంపాదించిన జీతంలో నుంచి ఒక్కొక్కరూ రూ.2000 చొప్పున నాకు ఇచ్చేవారు. ఆ డబ్బుతో షార్ట్ ఫిలింస్ తీశాను. ఒకసారి ఏదో పోటీలో నేను రెండో రౌండ్‌కు సెలక్ట్ అయ్యాను. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో..కానీ ఫ్రెండ్స్‌ను మళ్లీ డబ్బులడగాలంటే నాకు సిగ్గుగా అనిపించింది. ఆ సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్ ఇగీ.. అతడి తల్లికి ఫోన్ చేసి అశ్వత్ పోటీలో ముందుకు వెళ్లడానికి రూ.2 వేలిస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అది నేనెన్నటికీ మర్చిపోలేను. 8 షార్ట్ ఫిలింస్ తీశా.. నా ప్రతి అడుగులో వారు తోడున్నారు. నా ఫోన్ పగిలిపోయినప్పుడు బాలాజీ ఫోన్ కొనిచ్చాడు. ఇంత మంచి మిత్రులు నా జీవితంలో ఉన్నారు. మా గ్యాంగ్‌లో నేనే మిగిలా..నేను అందుకున్న విజయం వారి సొంతం. థాంక్యూ బాయ్స్.. ఈ రోజు మా గ్యాంగ్‌లో పంబు పెళ్లి జరిగింది. అంటే ఈ గ్యాంగ్‌లో సింగిల్‌గా మిగిలింది నేనొక్కడినే' అని రాసుకొచ్చాడు. ఇందుకు తన ఫ్రెండ్స్‌తో దిగిన పాత ఫోటోలను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఇంత మంచి స్నేహితులు దొరకడం నీ అదృష్టం.. నువ్వు జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు. ‘Return of The Dragon ‘ releasing in HINDI from MARCH 14 . Always wanted my movies to be watched by the whole of India, and here is our first step . Sharukh @iamsrk sir , Salman @BeingSalmanKhan sir , Aamir sir संभल जाओ, मैं आ रहा हूँ! 😂😂😂😂😂😂Link. :… pic.twitter.com/Lg99OWYIFn— Pradeep Ranganathan (@pradeeponelife) March 8, 2025Important post. Sometimes we fail to thank the most important people in our life because they are our friends and they won’t take it wrong !The bachelor room life that u see in ‘Dragon’ is almost 90 percent recreated from my life ! Not just the characters but also the place !… pic.twitter.com/k2Jzc64SFa— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 8, 2025చదవండి: కన్నడ స్టార్ యశ్‌తో విభేదాలు.. స్పందించిన సోదరి -
ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్.. దర్శకుడిపై రజనీ ప్రశంసలు!
ఏమి రైటింగ్. ఫెంటాస్టిక్. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon) ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్ ఇటీవల డ్రాగన్ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్ అంటూ డ్రాగన్ చిత్ర కథ గురించి అభినందించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్ మారిముత్తు తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rajini sir : what a writing Ashwath ! Fantastic fantastic !!🥹🥹nalla padam pannanum, padatha pathutu Rajini sir veetuku kooptu wish panni namma padatha pathi pesanum !! Ithu director aganum nu kasta patu ozhaikra ovoru assistant director oda Kanavu ! Kanavu neraveriya nal… pic.twitter.com/IFuHhNkqjY— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 5, 2025 -
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మహేశ్ సార్, ప్లీజ్.. ఆ ఒక్క పని చేయండి: డ్రాగన్ డైరెక్టర్
లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా రూ.100 కోట్లు దాటేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎస్ రాజమౌళిగారు నాకు ఇన్స్పిరేషన్. ఎమోషన్స్ కనెక్ట్ అయితే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్వుడ్.. ఎక్కడైనా హిట్ అవుతుందని ఆయన చెప్తుంటారు. మహేశ్ గర్విస్తారుఈ ప్రపంచంలో ప్రేమ, స్నేహం, తల్లిదండ్రులు అనే మూడు ఎమోషన్స్ సాధారణంగా ఉంటాయి. ఈ మూడూ మా సినిమాలో ఉన్నందునే విజయం సాధించింది. మీ అందరికీ ఓ విజ్ఞప్తి.. నేను డైరెక్ట్ చేసిన ఓ మై కడవులే సినిమా రిలీజైనప్పుడు మహేశ్‌బాబు గారు దాని గురించి ఒక్క ట్వీట్ చేశారు. అంతే.. తెలుగు సినీప్రేక్షకులందరూ ఓ మై కడవులే వీక్షించారు. డ్రాగన్ సినిమాను ఆయన చూడాలని ఎదురుచూస్తున్నాను. కచ్చితంగా మూవీ చూసి ఆయన గర్విస్తారనుకుంటున్నాను. దయచేసి ఈ సందేశాన్ని ఆయనవరకు చేరవేయండి.. సినిమా చూసేలా చేయండి అని కోరాడు.డ్రాగన్ సినిమాడ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. కల్పతి అఘోరం, కల్పతి గణేశ్, కల్పతి సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.చదవండి: అమ్మాయితో చాటింగ్ వైరల్.. తన ఉద్దేశం అది కాదన్న హీరోధనుష్ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్ -
ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ (Return of the Dragon Movie)తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ సమాధానాలిచ్చారు. మీ పర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ స్క్రీన్‌పై చూసినప్పుడు ధనుష్‌ను కాపీ చేసినట్లు అనిపిస్తుంది. ఎవర్నీ కాపీ కొట్టట్లేదుఆ విషయాన్ని మీరు గ్రహించారా? లేదా ఎవరైనా చెప్పారా? అని ఓ పాత్రికేయుడు అడిగారు. అందుకు ప్రదీప్ ఇబ్బందిగా నవ్వుతూనే.. చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నానన్నాడు. కాకపోతే తానెవరినీ ఇమిటేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫిజిక్, ఫేస్‌కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారని వివరణ ఇచ్చాడు. సేమ్ ధనుష్లాగే ఉండటం మీకు ప్లస్సా? మైనస్సా అన్న ప్రశ్నకు.. అదంతా నాకు తెలియదు.. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను మాత్రమే కనపడతాను. నేను తీసిన సినిమా బాగా ఆడుతోందంటే నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను అని హీరో తెలిపాడు. నా కళ్లకు ప్రదీప్లాగే ఉన్నాడు: దర్శకుడి అసహనంఇంతలో డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మైక్ అందుకుని.. మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరోలా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్లకు మాత్రం ప్రదీప్ రంగనాథన్లాగే ఉన్నాడు. కేవలం ఆయన్ను మిగతా హీరోతో పోల్చాలని మాత్రమే ఈ ప్రశ్న అడిగినట్లున్నారు. ప్రదీప్ రంగనాథన్లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు అని గరమయ్యాడు. డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైంది.చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్ -
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).ఎలా ఉందంటే.. 'లవ్ టుడే'తో భారీ హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాలేజీ సీన్స్ మొదలు క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.అయినా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాలేజీ ఎపిసోడ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్టైనింగ్ చెప్పాడు. ఎవరెలా చేశారంటే.. రాఘవన్ అలియాస్ డ్రాగన్‌గా ప్రదీప్ రంగనాథ్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
తెలుగులో నెక్స్ట్ టాప్ హీరోయిన్ నేనే.. మీమ్ రెడీ చేసుకున్న హీరోయిన్
లవ్‌టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రం (Return of the Dragon Movie)తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్తో పాటు కయాడు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరి 21న విడుదలవుతున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ ప్రమోషన్స్ బాగానే చేసింది. అందులో భాగంగా హీరోహీరోయిన్లు ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ ఓ ఆసక్తికర విషయం జరిగింది.లవ్ టుడే సీన్ రీక్రియేట్యాంకర్ మంజూష.. ప్రదీప్, కయాడు లోహర్లతో లవ్ టుడే సీన్‌ను రీక్రియేట్ చేసింది. ఇద్దరినీ ఫోన్లు మార్చుకోమంది. లోలోపల భయంగా ఉన్నా పైకి మాత్రం ఇద్దరూ సరేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకరి ఫోన్ మరొకరి చేతిలో పడ్డాక అసలు కథ మొదలైంది. కయాడు లోహర్ ఫోన్లో మీమ్ క్రియేషన్ యాప్ ఉందన్న విషయం బయటపెట్టాడు ప్రదీప్. దీంతో కంగుతిన్న హీరోయిన్ ఇంకా ఎక్కువ చూడొద్దని అడిగింది.తనపై తనే మీమ్ వేసుకున్న బ్యూటీకానీ ప్రదీప్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఏం మీమ్స్ ఉన్నాయో చూడాలని తహతహలాడాడు. అందులో భాగంగా ఓ మీమ్‌ను బయటపెట్టాడు. తెలుగులో నెక్స్ట్ టాప్ హీరోయిన్ కయాడు లోహర్ అని తనపై తనే మీమ్ వేసుకుందని చెప్పాడు. కయాడు ఏకంగా ప్రదీప్ వాట్సాప్ ఓపెన్ చేసింది. కేవలం నాకు మాత్రమే మీమ్స్ పంపుతానని చెప్పాడు. కానీ చూస్తే వేరే హీరోయిన్లకు కూడా పంపాడు అని చెప్పింది. దీంతో నీళ్లు నమిలిన ప్రదీప్ మమిత, అనుపమ.. ఇలా కొందరికి పంపుతూ ఉంటానని చెప్పాడు. భయపడిపోయిన హీరోఇక భయపడిపోయిన ప్రదీప్.. దీన్ని ఇంతటితో ఆపేద్దామంటూ వెంటనే ఫోన్ లాగేసుకున్నాడు. కయాడు లోహర్ తెలుగులో ఇదివరకే 'అల్లూరి' సినిమాలో నటించింది. కానీ అంత గుర్తింపు రాలేదు. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తోంది. ఆమె కల, ప్రయత్నాలు ఏమేరకు నెరవేరతాయో చూడాలి!చదవండి: 19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు