breaking news
Pratyusha (16)
-
'జయం' సినిమా మాదే.. ప్రత్యూషతో పరిచయం: శేఖర్ భాషా
బిగ్‌బాస్ ఫేం, ఆర్జే శేఖర్ భాషా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ప్రత్యూషతో పాటు జయం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ కోసం జరిగిన ఆడిషన్స్‌లో తాను సెలెక్ట్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. అయితే, హీరోయిన్గా ప్రత్యూషను ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. ఈ క్రమంలో దర్శకులు తేజ తమ ఇద్దరితో కలిపి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని ఆయన గుర్తుచేశారు.తాను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో జయం సినిమా కోసం దర్శకుడు తేజ ఆడిషన్స్ ప్రకటన ఇచ్చినట్లు శేఖర్ భాషా తెలిపారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆడిషన్స్‌లో పాల్గొన్నారన్నారు. అయితే, గట్టి పోటీ తట్టుకుని మొదట తాను ఎంపికయినట్లు చెప్పారు. ' సినిమా షూటింగ్స్‌లో భాగంగా నాతో కొన్ని సీన్స్ కూడా ప్రాక్టీస్ చేపించారు. ఆ తర్వాతనే హీరోయిన్గా ప్రత్యూష ఎంపిక చేశారు. స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూసేందుకు కొన్ని రిహార్సల్స్ కూడా చేపించారు. జయం సినిమాకు మేము ఇద్దరం ఫైనల్ అవుతామనే నమ్మకం ఏర్పడింది. కానీ, హీరోయిన్గా ఎంపికైన ప్రత్యూష మరణించడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ తర్వాత నిర్మాత కూడా ఈ మూవీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే, అదే కథతో కొద్దిరోజుల తర్వాత నితిన్, సదా కాంబినేషన్‌తో ‘జయం’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా భారీ విజయం అందకున్నప్పుడు జరిగిన విషయం చెబుదామనుకున్నాను. కానీ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుందని అప్పట్లో చెప్పలేదు. ప్రస్తుతం ప్రత్యూష మరణంపై కోర్టు తీర్పు రావడంతో సందర్భం అనిపించి ఈ విషయాన్ని చెబుతున్నాను అని శేఖర్ భాషా అన్నారు.‘జయం సినిమాలో ప్రత్యూషను హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు కొద్దిరోజుల క్రితం ఆమె తల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో వారి ఆఫీస్‌కెళ్లి వస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదని కూడా తెలిపింది. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డితో ఆమె వెళ్లడం, అనుమాస్పదంగా మరణించడం తెలిసిందే. -
ప్రత్యూషను...ఆదుకునేదెవరు...?
♦ ఒంటిపై పలు గాయాలు, శరీరంలో లోపల పుండ్లు ♦ సవతి తల్లి ఘాతుకానికి బలైన యువతి దైన్యం ♦ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ప్రజా సంఘాల విస్మయం సాక్షి, హైదరాబాద్ : సవతితల్లి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా గాయాలు, వాతలు, శరీరం లోపల పుండ్లు అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రీనల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ప్రత్యూష మొహంపైనే యాసిడ్‌తో దాడిచేసిన మచ్చ, గొంతులో యాసిడ్ వల్ల ఏర్పడిన గాయాలు, శరీరంపై చెప్పలేని ప్రాంతాల్లో సహా అన్ని భాగాల్లో సిగరెట్లతో కాల్చిన వాతలు, తలను గోడకు మోదడంతో ఏర్పడినవి, ఆమె దయనీయతను తెలియజేస్తున్నాయి. ‘యాసిడ్, హర్పిక్ వంటివి తాగించడం వల్ల నాలుక కమిలిపోయింది. మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కండరాలు వాచిపోయాయి. రక్తహీనతతో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఛాతీలో నీరు ఉండటం వల్ల ఆయాసం వస్తోంది. కుడి భుజం వద్ద కొట్టిన దెబ్బలతో రక్తం గడ్డకట్టుకుపోయింది. చెవుల నుంచి నిరంతరాయంగా చీము వస్తుంది’ అని ప్రత్యూషకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. కోలుకోవాలంటే నెలరోజులు ప్రత్యూష మళ్లీ మామూలుగా కావాలంటే దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. అప్పటివరకు ఆమెకు ప్రత్యేక వైద్యం అవసరమని డాక్టర్లు అంటున్నారు. ఆ తర్వాత ఆమెకు మరో నెలరోజుల పాటు మానసిక చికిత్స చేయాలి. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఎక్కడికెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. తల్లి చనిపోయింది. చిత్రహింసలు పెట్టిన మారుతల్లి చాముండేశ్వరి రిమాండులో ఉంది. తండ్రి రమేష్ పరారయ్యాడు. ఇలా ఎవరూలేని ప్రత్యూషకు మరో ఆరు నెలల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. అటు నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో పాటు వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు ఆమెకు ఎలా అన్నది ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటివరకు బాలల హక్కుల సంఘం అండగా నిలబడింది. ఇకపై ఎలా అన్నదే అందర్నీ వేధిస్తోంది. ప్రభుత్వం తీరుపై సంఘాల విస్మయం కుటుంబీకుల చేతిలో క్రూరంగా హింసకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రత్యూషను ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎవరూ వచ్చి పరామర్శించకపోవడంపై పలు ప్రజా సంఘా లు విస్మయం వ్యక్తం చేశాయి. ఆర్థికంగా అదుకుంటారని అనుకుంటున్న ప్రజాప్రతినిథులు ఆవైపుగా చూడకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యూషకు ఆర్థికంగా అండగా నిలవాలని అవి కోరుతున్నాయి.


