ఆ మూడు సినిమాలు తీసుంటే రిటైర్‌ అయ్యేవాడిని : సుకుమార్‌ | Sukumar Talk About Seetha Payanam Movie At Teaser Launch Event | Sakshi
Sakshi News home page

ఆ మూడు సినిమాలు తీసుంటే రిటైర్‌ అయ్యేవాడిని : సుకుమార్‌

May 29 2025 12:56 PM | Updated on May 29 2025 1:22 PM

Sukumar Talk About Seetha Payanam Movie At Teaser Launch Event

‘‘ఈ వేదికపై ఇద్దరు (అర్జున్, ఉపేంద్ర) లెజెండ్స్‌ ఉన్నారు. ఈ ఇద్దరూ యాక్టర్స్‌ మాత్రమే కాదు.. దర్శకులు కూడా. ‘ఓం, ఏ, ఉపేంద్ర... ఇలాంటి కల్ట్‌ సినిమాలు తీసిన తర్వాత ఏ దర్శకుడైనా రిటైర్‌ అయిపోవచ్చు. నేను ఆ మూడు చిత్రాలు తీసి ఉంటే రిటైర్‌ అయిపోయేవాడిని. ఈ రోజు నా స్క్రీన్‌ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే’’ అని అన్నారు దర్శకుడు సుకుమార్‌.

హీరోయిన్‌ ఐశ్వర్యా అర్జున్‌ ప్రధాన పాత్రలో, అర్జున్, ధ్రువ సర్జా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఈ టీజర్‌లో ఐశ్వర్య, నిరంజన్‌ బ్యూటిఫుల్‌గా కనిపించారు. అలాగే ఈ చిత్రంలో చంద్రబోస్‌ గారు రాసిన ఓ పాట విన్నాను. చాలా నచ్చింది. అనూప్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

‘‘నేను కాలేజీలో చదివిన రోజుల్లోనే అర్జున్‌ గారు నాకు డైలాగ్‌ రైటర్‌గా అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు అవకాశం కల్పించిన అర్జున్‌గారు, ఇప్పుడు నా అన్న కొడుకుకి అవకాశం ఇచ్చారు. ‘సీతాపయనం’ టీజర్‌ బ్యూటిఫుల్‌గా ఉంది’’ అన్నారు మరో ముఖ్య అతిథి ఉపేంద్ర. ‘‘నా హనుమాన్‌ జంక్షన్‌’ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేసిన సుకుమార్‌ ఇప్పుడు ఇండియాలోని టాప్‌ టెన్‌ దర్శకుల్లో ఒకరని చెప్పడం గర్వంగా ఉంది. ఉపేంద్రగారికి పెద్ద పెద్ద దర్శకులే అభిమానులుగా ఉంటారు. మా అమ్మాయి కోసం ఈ సినిమాను మొదలుపెట్టాను. నాపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమను మా అమ్మాయిపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను. నిరంజన్‌లో మంచి అంకితభావం ఉంది’’ అన్నారు. ‘‘సీతా పయనం’తో తెలుగు పరిశ్రమకు వస్తున్నందుకు, నాన్నగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా అర్జున్‌. ‘‘తెలుగులో నాకిది తొలి సినిమా’’ అన్నారు నిరంజన్‌. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement