భారత జట్టుకు రెండో విజయం | Second win for Indian womens basketball team | Sakshi
Sakshi News home page

భారత జట్టుకు రెండో విజయం

Jul 15 2026 2:47 AM | Updated on Jul 15 2026 2:47 AM

Second win for Indian womens basketball team

బ్యాంకాక్‌: ఆసియా కప్‌ అండర్‌–18 మహిళల బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 99–17తో ఒమన్‌ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన జొన్నలగడ్డ విహా రెడ్డి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... నేత్ర బిరుదవోలు, శాన్వీ కొలిశెట్టి కూడా భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఒమన్‌తో మ్యాచ్‌లో విహా 13 నిమిషాలు, నేత్ర 16 నిమిషాలు, శాన్వీ 13 నిమిషాలు బరిలో ఉన్నారు. భారత్‌ తరఫున తారుశ్రీ 25 పాయింట్లు స్కోరు చేయగా... సాధన, ఏంజెలినా, మెహక్‌ శర్మ 12 పాయింట్ల చొప్పన సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement