సెమీస్‌లో ఫ్రాన్స్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్‌ | FIFA World Cup 2026 semi-final: Spain outplay France to make it to World Cup final | Sakshi
Sakshi News home page

FIFA World Cup: సెమీస్‌లో ఫ్రాన్స్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్‌

Jul 15 2026 2:35 AM | Updated on Jul 15 2026 3:11 AM

FIFA World Cup 2026 semi-final: Spain outplay France to make it to World Cup final

PC: X.com

ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డల్లాస్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 2-0 తేడాతో పటిష్టమైన ఫ్రాన్స్‌ను స్పెయిన్ మట్టికరిపించింది. ఈ అద్భుత విజయంతో స్పెయిన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిఫా చర్రితలో స్పెయిన్‌ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది రెండో సారి.

ఒయర్జబాల్ పెనాల్టీ గోల్
ఈ మ్యాచ్ 21వ నిమిషంలో స్పెయిన్ టీనేజ్ సంచలనం లామైన్ యమల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నె బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకెండ్ హాఫ్‌లో కూడా "లా రోజా" జట్టు తమ జోరును కొనసాగించింది. 58వ నిమిషంలో పెడ్రో పోర్రో సూపర్ స్ట్రైక్‌తో మరో గోల్ కొట్టి స్పెయిన్ విజయాన్ని ఖాయం చేశాడు. 

అయితే ఈ కీలక మ్యాచ్‌లో  కిలియన్ ఎంబాపె సారథ్యంలోని ఫ్రాన్స్‌ జట్టు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరుస తప్పిదాల కారణంగా ఫ్రాన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్రాన్స్ స్టార్ సెంటర్-బ్యాక్ ఆటగాడు విలియం సాలిబా గాయంతో మైదానాన్ని వీడటం కూడా ఆజట్టును దెబ్బ తీసింది. ఈ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement