Teams Qualified For Super 6 Stage In CWC Qualifier 2023, Check Match Scheduele Details - Sakshi
Sakshi News home page

CWC Qualifier 2023: సూపర్‌ సిక్స్‌కు చేరిన జట్లు, తదుపరి షెడ్యూల్‌ వివరాలు

Jun 26 2023 8:55 AM | Updated on Jun 26 2023 10:43 AM

Teams Qualified For Super 6 Stage In CWC Qualifier 2023 - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో గ్రూప్‌ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్‌ సిక్స్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌ సూపర్‌ సిక్స్‌కు చేరుకోగా.. నేపాల్‌, యూఎస్‌ఏ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ సూపర్‌ సిక్స్‌కు చేరుకోగా.. ఐర్లాండ్‌, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

సూపర్‌ సిక్స్‌ దశ మ్యాచ్‌లు జూన్‌ 29 నుంచి ప్రారంభమవుతాయి. సూపర్‌ సిక్స్‌ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఓ గ్రూప్‌లోని మూడు జట్లు మరో గ్రూప్‌లోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఏ పొజిషన్‌లో ఉంటుందో డిసైడ్‌ కాలేదు. 

గ్రూప్‌-ఏలో జింబాబ్వే తొలి స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకోగా.. వెస్టిండీస్‌-నెదర్లాండ్స్‌  మధ్య మ్యాచ్‌లో (జూన్‌ 26) విజేత రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక-స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌లో (జూన్‌ 27) విజేత గ్రూప్‌ టాపర్‌ నిలుస్తుంది. మరో జట్టు ఒమన్‌ తమ కోటా మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది.

సూపర్‌ సిక్స్‌కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే 2 పాయింట్లతో తదుపరి దశకు చేరతాయి. గ్రూప్‌-ఏలో జింబాబ్వే.. తమ గ్రూప్‌లోని నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించడంతో సూపర్‌ సిక్స్‌ దశకు రెండు పాయింట్లతో అడుగుపెడుతుంది. అలాగే గ్రూప్‌-బిలో శ్రీలంక-స్కాట్లాండ్‌ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత 2 పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరుకుంటుంది.

సూపర్‌ సిక్స్‌ షెడ్యూల్‌ (అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి)..

  • జూన్‌ 29: ఏ2 వర్సెస్‌ బి2 
  • జూన్‌ 30: ఏ3 వర్సెస్‌ బి1
  • జులై 1: ఏ1 వర్సెస్‌ బి3
  • జులై 2: ఏ2 వర్సెస్‌ బి1
  • జులై 3: ఏ3 వర్సెస్‌ బి2
  • జులై 4: ఏ2 వర్సెస్‌ బి3
  • జులై 5: ఏ1 వర్సెస్‌ బి2
  • జులై 6: ఏ3 వర్సెస్‌ బి3
  • జులై 7: ఏ1 వర్సెస్‌ బి1

సూపర్‌ సిక్స్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జులై 9న జరిగే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ఫైనల్‌లో తలపడటంతో పాటు భారత్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement