ఒమన్‌లో పెను విషాదం | 4 children killed in oman building collapse | Sakshi
Sakshi News home page

ఒమన్‌లో పెను విషాదం

Mar 22 2026 11:11 PM | Updated on Mar 22 2026 11:11 PM

4 children killed in oman building collapse

ఒమన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. రుస్తాక్ విలాయత్‌లోని అల్-హైమాలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పాడుబడిన ఓ మట్టి భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చిన్నారులు భవనంలో ఆడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.

ఒమన్‌లో గతంలో కూడా పాడుబడిన భవనాలు, గోడలు కూలి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

మరోపక్క ఒమన్‌ ఇరాన్‌ మిస్సైల్‌ దాడులతో సతమతమవుతుంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతిరోజు ఒమన్‌పై దాడులు చేస్తుంది. ఒమన్‌తో నేరుగా ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న కారణంగా ఇరాన్‌ దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్‌,అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.  

Advertisement
 
Advertisement
Advertisement