హర్ముజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన | Iran Says Ships Passing Through Strait Of Hormuz Will No Longer Travel Free, Signals New Maritime Fee Policy With Oman | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన

Jun 13 2026 5:46 PM | Updated on Jun 13 2026 6:51 PM

iran says ships strait hormuz will face service fees not free passage

టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్‌, ఒమన్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.

పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్‌ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్‌ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.

అబ్బాస్‌ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అ‍న్నారు.

ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్‌ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్‌ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement