breaking news
Abbas Aragchi
-
ఫ్యామిలీకి అదే చివరి కాల్ అనుకున్నా.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది. -
లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగాల్సిందే
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని నెలకొల్పాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం తేల్చిచెప్పారు. అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చినట్లు వెల్లడించారు. అయితే, ఈ షరతును ఇజ్రాయెల్ ఇప్పటికే తిరస్కరించిందని అన్నారు. ఇజ్రాయెల్ వైఖరిలో మార్పు రాకపోతే తాత్కాలిక ఒప్పందం నిరీ్వర్యమైపోయి, మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కావొచ్చని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఇంకా బహిర్గతం చేయలేదు. అందులోని అంశాలపై అమెరికా, ఇరాన్ అధికారులు అప్పుడప్పుడు పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చారు. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లెబనాన్‌లో ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌తో ఇజ్రాయెల్ పోరాడుతోంది. లెబనాన్‌లో విస్తృతమైన ప్రాంతాలను ఇప్పటికే స్వా«దీనం చేసుకుంది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దురాక్రమణ ఇంకా కొనసాగితే.. అది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అబ్బాస్ అరాగ్చీ స్పష్టంచేశారు. ఈ యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి వెళ్లకపోతే యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని పేర్కొన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ అంశాన్ని ఒప్పందంలో చేర్చలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం మాట్లాడుతూ.. అవసరమైనంత కాలం తమ సైన్యం లెబనాన్‌లోనే ఉంటుందని అన్నారు. అయితే ఇరాన్ పట్టుబడుతున్నట్లుగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సహా సైనిక కార్యకలాపాలను ముగించాలని ఈ ఒప్పందంలో ఉన్నట్లు తాజాగా పాకిస్తాన్ వెల్లడించింది. -
ఇరాన్ శాంతి ఒప్పందంలో మరో ట్విస్ట్
టెహ్రాన్: అమెరికాతో శాంతి ఒప్పందంపై ఇరాన్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోని అతివాదుల వర్గం చర్చలు అవసరం లేదంటూ ధర్నాలు చేపడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని అక్రమ చొరబాటుదారుడిగా అభివర్ణిస్తూ వాషింగ్టన్‌తో ఆయన రాజీ పడుతున్నారని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రస్తుతం ప్రపంచ దేశాలు దృష్టంతా ఇరాన్- అమెరికా చర్చలపైనే.. ఈ భేటీలో శాంతి ఒప్పందం కుదురుతుందా ఈ యుద్ధానికి శాశ్వతంగా తెరపడుతుందా అనే అంతా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని అతివాద వర్గం మాత్రం చర్చలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం వల్ల 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' పై టెహ్రాన్ నియంత్రణ, ప్రభావం తగ్గుతుందని వాదిస్తున్నారు.ఈ మేరకు ( శనివారం) ఆ దేశంలోని అతివాద గ్రూపులకు చెందిన మద్దతు దారులు రాజధాని టెహ్రాన్‌తో పాటు మషహాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెలుపల భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అబ్బాస్ అరాగ్చీ నశించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గౌరవం లేని, రాజీపడే అరాగ్చీ నశించాలి, అరాగ్చీ, సిగ్గు తెచ్చుకో... లొంగిపోవడం ఆపు, దేశద్రోహి, చొరబాటుదారుడైన అరాగ్చీ నశించాలి" అంటూ తీవ్ర పదజాలంతో అరాగ్చీపై మండిపడ్డారు. ప్రస్తుతం జరిగే ఏ ఒప్పందం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పూర్తి అంగీకారం లేకుండా జరగదని స్పష్టం చేశారు.అయితే ఈ నిరసనల నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు. హర్ముజ్ అనేది ఇరాన్ యొక్క ప్రధాన రక్షణ ఆయుధాలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఈ రాబోయే ఒప్పందం వల్ల ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం తొలగిపోతుందని పేర్కొన్నారు.కాగా అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌లోని అతివాదులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇరాన్ మరింత దూకుడుగా అణు విధానాన్ని అవలంబించాలని 'అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం' నుండి ఇరాన్ వైదొలగాలని, నేరుగా అణుబాంబు తయారీ వైపు అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు 🚨🇮🇷 Footage reportedly shows demonstrators on the streets of Iran turning on their own negotiators, chanting for revenge and demanding the talks be scrapped. One chant is aimed straight at the foreign minister: "Araghchi, have some shame, put the negotiations aside."… pic.twitter.com/GXOtPIg1ug— Mario Nawfal (@MarioNawfal) June 13, 2026 -
హర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అన్నారు.ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్‌పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్‌పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు. -
భారత్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. పర్యటన ఫలిస్తుందా..?
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత్ చేరుకున్నారు. ఈ రోజు (మే 14,15) తేదీలలో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అరాఘ్చీకి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మెుదలైన తర్వాత ఇరాన్ ప్రతినిధులు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఆయన వినియోగించిన మినాబ్ 168 విమానం ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్దం ముగిసిందా అనే విషయంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు దేశాలు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో యుద్ధం ముగింపుపై స్పష్టత వచ్చే అంశం కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన ఇప్పుడు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది.మినాబ్ 168 విమానంలో భారత్ చేరుకున్న అరాగ్చీఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మినాబ్ 168 అనే పేరు గల ఇరాన్ విమానంలో భారత్ చేరుకున్నారు. ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల మీద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది బాలికలు మరణించారు. అమాయక పౌరులపై జరిగిన దాడులకు గుర్తుగా, ఆ విషాద ఘటనను ప్రతిబింబించేలా ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఎండగట్టడానికి ఇది చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ఒత్తిడి తెస్తున్న ఇరాన్అయితే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌పై ఇరాన్ గత కొంతకాలంగా ఇరాన్ ఒత్తిడి చేస్తూ వస్తుంది. అయితే కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో ఈ అంశంలో యుఏఈతో పాటు ఇతర సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుత సమావేశంలో యుద్ధంపై ఉమ్మడి ప్రకటన వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.సమావేశ ప్రధాన లక్ష్యాలు"BRICS@20: స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం" అనే థీమ్‌తో జరుగుతోంది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు మరియు బహుపాక్షిక వ్యవస్థల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. అయితే, సభ్య దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ కూటమి ఐక్యతకు పరీక్షగా మారాయి.#WATCH | Delhi: Foreign Minister of Iran, Syed Abbas Araghchi arrives in India for the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/l5c8DqzYLc— ANI (@ANI) May 13, 2026 -
ఇరాన్లో పెను సంచలనం.. అబ్బాస్ అరాగ్చీ తొలగింపుకు ప్లాన్
టెహ్రాన్: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.


