ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత్ చేరుకున్నారు. ఈ రోజు (మే 14,15) తేదీలలో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అరాఘ్చీకి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మెుదలైన తర్వాత ఇరాన్ ప్రతినిధులు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఆయన వినియోగించిన మినాబ్ 168 విమానం ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది.
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం నడుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్దం ముగిసిందా అనే విషయంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు దేశాలు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో యుద్ధం ముగింపుపై స్పష్టత వచ్చే అంశం కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన ఇప్పుడు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మినాబ్ 168 విమానంలో భారత్ చేరుకున్న అరాగ్చీ
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మినాబ్ 168 అనే పేరు గల ఇరాన్ విమానంలో భారత్ చేరుకున్నారు. ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల మీద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది బాలికలు మరణించారు. అమాయక పౌరులపై జరిగిన దాడులకు గుర్తుగా, ఆ విషాద ఘటనను ప్రతిబింబించేలా ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఎండగట్టడానికి ఇది చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్‌పై ఒత్తిడి తెస్తున్న ఇరాన్
అయితే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌పై ఇరాన్ గత కొంతకాలంగా ఇరాన్ ఒత్తిడి చేస్తూ వస్తుంది. అయితే కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో ఈ అంశంలో యుఏఈతో పాటు ఇతర సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుత సమావేశంలో యుద్ధంపై ఉమ్మడి ప్రకటన వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
సమావేశ ప్రధాన లక్ష్యాలు
"BRICS@20: స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం" అనే థీమ్‌తో జరుగుతోంది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు మరియు బహుపాక్షిక వ్యవస్థల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. అయితే, సభ్య దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ కూటమి ఐక్యతకు పరీక్షగా మారాయి.
#WATCH | Delhi: Foreign Minister of Iran, Syed Abbas Araghchi arrives in India for the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/l5c8DqzYLc
— ANI (@ANI) May 13, 2026


