దుబాయిలో 8 మంది భారతీయుల మృతి | 8 Indians among 17 killed in fatal bus crash in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

Jun 7 2019 10:41 AM | Updated on Jun 7 2019 11:01 AM

8 Indians among 17 killed in fatal bus crash in Dubai - Sakshi

మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

దుబాయి: యూఏఈలోని దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అతివేగంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్‌కు చెందిన రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరన్‌ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్‌ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement