పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక | Trump issues stern warning to Oman | Sakshi
Sakshi News home page

పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక

May 28 2026 3:26 AM | Updated on May 28 2026 3:26 AM

Trump issues stern warning to Oman

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్‌కు మాస్ వార్నింగ్‌ ఇచ్చారు. ఒకవేళ హర్ముజ్‌ విషయంలో ఒమన్‌ గనుక ఇరాన్‌కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాన్ని పేల్చి పడేస్తాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఆయన అమెరికా మిత్ర దేశమైన ఒమన్‌పై విరుచుకపడ్డారు

అమెరికాలో జరిగిన ఓసమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హర్ముజ్‌ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్  "లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది. అది అంతర్జాతీయ జలభాగం. మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం బాగా తెలుసు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్‌ని అన్నారా? లేక ఇరాన్‌కి బదులుగా పొరబాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.  అనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్‌హౌస్‌నను కోరినటప్పటికీ వారు స్పందించనట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement