ఆధునిక ప్రపంచంలో ఇలాంటి మూఢ నమ్మకాలు, ఆచారాలు పాటిస్తున్నారనేందుక నిలువెత్తు నిదర్శనం..పౌర్ణమి రోజున తల్లిదండ్రులు ఒక శిశువును బలి ఇవ్వబోయిన ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపర్చింది. చట్టపరంగా దత్తత తీసుకొనిమరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. బెంగళూరులో ‘బలి’ కాబోయిన శిశువును అధికారులు రక్షించారు.
పౌర్ణమి రోజున ఒక శిశువును బలి ఇవ్వబోతున్నారంటూ ఉదయం 10.40 గంటలకు జాతీయ పిల్లల హెల్ప్‌లైన్ (1098)ను ఒక అపరిచిత వ్యక్తి పోన్ ద్వారా హెచ్చరించాడు. శనివారం హోస్కోట్‌లోని సులిబెలే గ్రామంలోని ఒక ఇంట్లో ఈ ఘోరం జరగబోతోందనేది ఆ ఫోన్ కాలం సారాంశం. అయితే ఆ ప్రదేశాన్ని గుర్తించడం సవాలుగా మారినప్పటికీ, జిల్లా పిల్లల రక్షణ విభాగం (DCPU), చైల్డ్‌లైన్ అధికారులు సంబంధిత జనతా కాలనీలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి చేరుకున్న తరువాత అక్కడి దృశ్యాలను చూసి వారే షాక్‌య్యారు. గుప్త నిధిని వెలికితీసేందుకు పౌర్ణమి రోజులు ముహూర్తం నిర్ణయించుకుని ఎనిమిది నెలల పసిగుడ్డను బలి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఒక జంట. లివింగ్ రూమ్‌లో దాదాపు 2.5 అడుగుల 2 అడుగుల పొడవున్న తాజాగా గొయ్యి తవ్వారు. ధూప, దీప నైవేద్యాలతో సర్వం సిద్ధం చేసుకున్నారు. నిందితులైన జంటను విక్రేతలు సయ్యద్ ఇమ్రాన్, అతని భార్యగా గుర్తించారు. నరబలి ఇచ్చే ఉద్దేశం తమకు లేదని ఆ దంపతులు ఖండించిరు. అయితే గొయ్యి ఎందుకు తవ్వారు అనేదానిపై వారు సమాధానాన్ని దాటవేశారు. బాలుడిని రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. బాలుడు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని, శిశు సంక్షేమ కేంద్రంలోని సిబ్బందితో బాగా కలిసిపోయాడని వివరించారు.
జిల్లా బాలల రక్షణ అధికారిణి అనితా లక్ష్మి మాట్లాడుతూ, సదరు కీలక వ్యక్తి సమాచారం సరిగ్గా ఇవ్వలేక పోయినప్పటికీ, టీం సరిగ్గా గుర్తించి, పాపను విజయంవంతంగాకాపాడగలిగామని పేర్కొన్నారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు జంటను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వారు బిడ్డ జీవసంబంధమైన తల్లిదండ్రులు కాదని తేలింది. దాదాపు ఏడాది క్రితం కోలార్‌లోని దినసరి కూలీల నుండి ఆ శిశువును అక్రమంగా దత్తత తీసుకున్నారని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆ శిశువు తల్లిదండ్రులు ఆచూకీ లభించలేదు. వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
గుంతకు సంబంధించిన ఫోటోలతోపాటు,బాలల పరిరక్షణ అధికారుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరగనుంది. కర్ణాటక అమానవీయ దురాచారాలు మరియు చేతబడి నివారణ, నిర్మూలన చట్టం, 2017తో పాటు సంబంధిత బాలల పరిరక్షణ చట్టాల కింద కేసు నమోదు చేయనున్నారు. బాలల సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) కూడా అక్రమ దత్తత మరియు మూఢనమ్మకాల విస్తృత సందర్భంపై దర్యాప్తు ప్రారంభించారు.


