శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్‌.. | PAK vs SL, 3rd ODI: Bowlers set up 3-0 sweep for Pakistan | Sakshi
Sakshi News home page

PAK vs SL 3rd Odi: శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్తాన్‌..

Nov 17 2025 8:35 AM | Updated on Nov 17 2025 9:47 AM

PAK vs SL, 3rd ODI: Bowlers set up 3-0 sweep for Pakistan

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్‌ 6 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. సదీరా సమరవిక్రమ (65 బంతుల్లో 48; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ (34), పవన్‌ రత్నాయకే (32), కామిల్‌ మిశారా (29), పతుమ్‌ నిసాంక (24) ఫర్వాలేదనిపించారు.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ వసీమ్‌ (3/47) లంకను దెబ్బ తీయగా...హారిస్‌ రవూఫ్, ఫైసల్‌ అక్రమ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాకిస్తాన్‌ 44.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (92 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు), ఫఖర్‌ జమాన్‌ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...హుస్సేన్‌ తలత్‌ (42 నాటౌట్‌), బాబర్‌ ఆజమ్‌ (34) రాణించారు.

జెఫ్రీ వాండర్సే 3 వికెట్లు పడగొట్టాడు. 3 మ్యాచ్‌లలో కలిపి 9 వికెట్లు పడగొట్టిన హారిస్‌ రవూఫ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. రేపటి నుంచి రావాల్పిండి ముక్కోణపు టోర్నీ జరుగుతుంది. ఈ టోరీ్నలో పాక్, శ్రీలంకతో పాటు జింబాబ్వే బరిలో నిలిచింది.
చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement