
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా పాక్‌కు జట్టుకు భారత్ చేతిలో పరాభావం ఎదురైంది. లీగ్ స్టేజి, సూపర్-4లో టీమిండియాపై ఓటమి చవిచూసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు ఫైనల్లో కూడా భంగపాటు తప్పలేదు.
ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ ఆటగాళ్లు జీర్ణించుకులేకపొతున్నారు. అంతకుతోడు భారత ఆటగాళ్లు కనీసం కరచాలనం చేయకపోవడం, ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలలో వారితో కలిసి పాల్గోకపోవడంతో దాయాది ఆటగాళ్లు ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.
ఫైనల్ మ్యాచ్ ముగిసినంతరం ఏసీసీ ఛీప్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకు సిద్దంగా ఉన్నప్పటికి భారత ఆటగాళ్లు మాత్రం వేదిక దగ్గరకు కూడా రాలేదు. దీంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను తీసుకున్నారు.
పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..
ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) చైర్మెన్, ఏసీసీ ప్రతినిథి ఆమినుల్ ఇస్లాం రన్నరప్ టైటిల్ అందజేశారు. అయితే ఇక్కడే సల్మాన్ అలీ ఓవరాక్షన్ చేశాడు. చెక్కు తీసుకున్న పాక్ కెప్టెన్ వెంటనే స్టేజ్ మీద నుంచి కిందకు విసిరేశాడు.
అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో సల్మాన్ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్టేజిపై నుంచి కిందకు వస్తుండగా సల్మాన్‌ను భారత్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ హేళన చేశారు.
దీంతో అతడు చేసేదేమి లేక నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మరి అంత పొగరు పనికిరాదు అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAK pic.twitter.com/GkEn7deKZj
— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025