India vs Pakistan: భారత్‌ తొలి వికెట్‌ డౌన్‌.. గిల్‌ ఔట్‌ | Asia Cup 2025: India vs Pakistan Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

India vs Pakistan: భారత్‌ తొలి వికెట్‌ డౌన్‌.. గిల్‌ ఔట్‌

Sep 14 2025 7:32 PM | Updated on Sep 14 2025 10:13 PM

Asia Cup 2025: India vs Pakistan Match Live Updates And Highlights

India vs Pakistan Match live updates: ఆసియాక‌ప్‌-2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది.

భారత్‌ తొలి వికెట్‌ డౌన్‌.. గిల్‌ ఔట్‌
 

టీమిండియా టార్గెట్‌@128
దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు.

 మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.

తొమ్మిదో వికెట్‌ డౌన్‌..
పాకిస్తాన్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సోఫియన్‌ ముఖియమ్‌.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

పాక్‌ ఎనిమిదో వికెట్ డౌన్‌..
పాకిస్తాన్‌కు ఆలౌట్‌కు చేరువైంది. ఫహీం అష్రఫ్(11) రూపంలో పాక్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో అష్రప్‌ ఔటయ్యాడు. 18 ఓవర్లకు పాక్‌ స్కోర్‌: 99/8. క్రీజులో షాహీన్‌ అఫ్రిది(15), ముఖియమ్‌(1) ఉన్నారు.

పాక్‌ ఏడో వికెట్‌ డౌన్‌..
సాహిబ్జాదా ఫర్హాన్ రూపంలో పాకిస్తాన్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఫర్హాన్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కుల్దీప్‌కు ఇది మూడో వికెట్‌. 16.1 ఓవర్లకు పాక్‌ స్కోర్‌: 83/7

12.5: ఆరో వికెట్‌ కోల్పోయిన పాక్‌
కుల్దీప్‌ యాదవ్‌ మహ్మద్‌ నవాజ్‌ను డకౌట్‌ చేశాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకుని వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాక్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. స్కోరు:  65/6 (13).

12.4: ఐదో వికెట్‌ కోల్పోయిన పాక్‌
కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ హసన్‌ నవాజ్‌ (5) అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. సాహిబ్‌జాదా 32, నవాజ్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (12.4).

నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌
9.6: అక్షర్‌ పటేల్‌ మరోసారి అదరగొట్టాడు. అద్భుతమైన బంతితో సల్మాన్‌ ఆఘా (3)ను పెవిలియన్‌కు పంపాడు. అక్షర్‌ బౌలింగ్‌లో సల్మాన్‌ ఇచ్చిన బంతిని అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో పాక్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్కోరు:  49/4 (10). సల్మాన్‌ స్థానంలో హసన్‌ నవాజ్‌ క్రీజులోకి రాగా.. సాహిబ్‌జాదా 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

 

 

మూడో వికెట్‌ కోల్పోయిన పాక్‌
7.4: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఫఖర్‌ జమాన్‌ (17) అవుటయ్యాడు. జమాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్‌ వర్మ అద్భుత రీతిలో పట్టడంతో.. పాక్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. పాక్‌ స్కోరు: 45/3 (7.4) 

పవర్‌ ప్లేలో పాకిస్తాన్‌ స్కోరు: 42/2 (6)
సాహిబ్‌జాదా 19, ఫఖర్‌ జమాన్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు

మూడు ఓవర్ల ఆట ముగిసే సరికి పాకిస్తాన్‌ స్కోరు:  20/2
సాహిబ్‌జాదా మూడు, ఫఖర్‌ జమాన్‌ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌
1.2: బుమ్రా బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన మహ్మద్‌ హ్యారిస్‌. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి హ్యారిస్‌ అవుటయ్యాడు. పాక్‌ స్కోరు:  6/2 (1.2)

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌..
0.1: పాకిస్తాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సైమ్‌ అయూబ్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. 

ఆసియాక‌ప్‌-2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్ సల్మాన్‌ అలీ అఘా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరి ఫాస్ట్ బౌలర్లలతో మెన్ ఈన్ గ్రీన్ బరిలోకి దిగింది. స్పీడ్ స్టార్ హరిస్ రౌఫ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. 

ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. దీంతో గిల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌, అక్షర్ పటేల్ స్పిన్నర్లగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఫ్రంట్ లైన్ పేసర్‌గా ఉన్నాడు. బుమ్రాతో పాటు ఆల్‌రౌం‍డర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకోనున్నారు.

తుది జట్లు
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్‌), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

పాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్‌), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement