టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సన్నాహకంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆసీస్- పాక్ మధ్య లాహోర్ వేదికగా గురువారం తొలి టీ20తో సిరీస్ మొదలైంది.
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ట్రవిస్ హెడ్
గడాఫీ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. కంగారూలు బౌలింగ్ అటాక్ మొదలుపెట్టారు. ఇక పాక్‌తో తొలి టీ20 నేపథ్యంలో ఆస్ట్రేలియా తుదిజట్టులో కీలక మార్పు కనిపించింది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ దూరం కాగా.. అతడి స్థానంలో విధ్వంసకర ఓపెనర్ ట్రవిస్ హెడ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ముగ్గురి అరంగేట్రం
అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ ప్రయోగానికి తెరతీసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్‌మాన్, జాక్ ఎడ్వర్డ్స్, మ్యాట్ రెన్షా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టారు.
ఇటీవల ముగిసిన బిగ్‌బాష్ లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా యాజమాన్యం వీరికి అవకాశం కల్పించింది. అయితే, ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో లేకపోవడం గమనార్హం. ఇక మార్ష్‌తో పాటు గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ వంటి స్టార్లు కూడా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు.
పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టీ20 తుదిజట్లు
ఆస్ట్రేలియా
ట్రవిస్ హెడ్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, కామెరాన్ గ్రీన్, మ్యాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్(వికెట్ కీపర్), జాక్ ఎడ్వర్డ్స్, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా, మహ్లి బియర్డ్‌మాన్
పాకిస్తాన్
సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ ఆయుబ్, బాబర్ ఆజం, సల్మాన్ ఆఘా (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.
చదవండి: అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్


